బస్తీ బాలరాజుకి క్షమించి మరో అవకాశం ఇవ్వండి అంటున్న కార్తికేయ

ఆర్ఎక్స్ 100 సినిమాతో హీరోగా టాలీవుడ్ లో తనకంటూ గుర్తింపు సొంతం చేసుకున్న నటుడు కార్తికేయ.

ఈ యువ హీరో మొదటి సినిమాతోనే అదిరిపోయే పెర్ఫార్మెన్స్ తో అందరిని మెస్మరైజ్ చేసి తరువాత వరుసగా అవకాశాలు సొంతం చేసుకున్నాడు.

అయితే ఆర్ఎక్స్ తర్వాత వరుసగా మూడు సినిమాలు హీరోగా చేసిన కార్తికేయకి మొదటి సినిమా ఇమేజ్ మాత్రం పోలేదు.దీనికి కారణం ఆ మూడు సినిమాలు అనుకున్న స్థాయిలో ప్రేక్షకులకి కనెక్ట్ కాకపోవడమే.

రొటీన్ ఫార్ములా కథలతోనే సినిమాలు చేయడం వలన కార్తికేయ చేసిన సినిమాలు ఎవరేజ్, ఫ్లాప్ అవుతూ వచ్చాయి.అయినా కూడా ఈ కుర్ర హీరోకి అవకాశాలు భాగానే వస్తున్నాయి.

గ్యాంగ్ లీడర్ సినిమాతో విలన్ గా కూడా మెప్పించడంతో ఏకంగా తమిళ్ స్టార్ అజిత్ హీరోగా తెరకెక్కుతున్న వాలిమై సినిమాలో మెయిన్ విలన్ గా నటించే ఛాన్స్ వచ్చింది.అదే సమయంలో ఏకంగా గీతా ఆర్ట్స్ లాంటి పెద్ద బ్యానర్ లో హీరోగా సినిమా చేసే ఛాన్స్ కూడా కార్తికేయకి వచ్చింది.

Advertisement

గీతా ఆర్ట్స్ 2లో చావు కబురు చల్లగా అనే సినిమాతో తాజాగా కార్తికేయ ప్రేక్షకుల ముందుకి వచ్చాడు.ఈ సినిమాలో కార్తికేయ చేసిన బస్తీ బాలరాజు పాత్ర రిలీజ్ కి ముందే అందరికి కనెక్ట్ అయ్యింది.

అయితే మన ఈ సినిమాలో ఒక భర్త చనిపోయిన వివాహితని ప్రేమించే యువకుడుగా కార్తికేయ మంచి పెర్ఫార్మెన్స్ కనబరించాడు.అయితే కాన్సెప్ట్ కొత్తగా ఉన్న ప్రేక్షకులకి ఎందుకనో కనెక్ట్ కాలేదు.

కొత్త పాయింట్ తీసుకున్న దాని చుట్టూ అల్లుకున్న కథనం అంతా రొటీన్ గా ఉండటంతో బలమైన పాత్ర అయిన వర్క్ అవుట్ అవ్వలేదనే టాక్ వినిపిస్తుంది.ఇదిలా ఉంటే చావు కబురు చల్లగా సినిమాకి డిజాస్టర్ అయిన విషయాన్ని కార్తికేయ కూడా అంగీకరించాడు.

సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్ అందరికి సారీ చెప్పాడు.ఈ సినిమా ఫలితం పక్కనపెడితే నటుడుగా నాలో మరోకోణం బయటపెట్టింది.

పుష్ప సినిమాతో నాకు వచ్చిందేమీ లేదు.. ఫహద్ ఫాజిల్ షాకింగ్ కామెంట్స్ వైరల్!
కెనడాలో మరోసారి ఖలిస్తాన్ మద్ధతుదారుల ర్యాలీ.. భారత అధినాయకత్వమే లక్ష్యమా..?

అలాగే కొందరి మనసులకు కూడా బాగా దగ్గరైంది.నిజానికి బస్తీ బాలరాజ్ పాత్ర చేసినందుకు చాలా గర్వంగా ఉంది.

Advertisement

కానీ సినిమా నచ్చని వారు తప్పకుండా క్షమించి మరో అవకాశం ఇవ్వాలని కోరుతున్నాను.ఈసారి ఖచ్చితంగా తప్పులను రిక్టీఫై చేసి బౌన్స్ బ్యాక్ అవుతానని చెప్పుకొచ్చాడు.

తాజా వార్తలు