న్యూలుక్‏తో ఆకట్టుకున్న ప్రేమీ విశ్వనాథ్.. రెడ్ డ్రెస్ లో ఏంజెల్ లా?

సాధారణంగా సినిమా హీరోయిన్లకు కోట్ల సంఖ్యలో అభిమానులు ఉంటారు.

అయితే స్టార్ హీరోయిన్లను మించి బుల్లితెర నటి ప్రేమీ విశ్వనాథ్ కు భారీ స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.

కార్తీకదీపం సీరియల్ లో వంటలక్క పాత్రలో ప్రేమీ విశ్వనాథ్ డీ గ్లామరస్ గా కనిపిస్తారనే సంగతి తెలిసిందే.న్యూ లుక్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న ప్రేమీ విశ్వనాథ్ ను చూసి నెటిజన్లు ప్రేమీ విశ్వనాథ్ చాలా అందంగా ఉన్నారని కామెంట్లు చేస్తున్నారు.

కొందరు అభిమానులు ప్రేమీ విశ్వనాథ్ సీరియళ్లకు దూరంగా ఉంటూ సినిమాల్లోనే కెరీర్ ను కొనసాగిస్తే బాగుంటుందని కామెంట్లు చేస్తుండటం గమనార్హం.కార్తీకదీపం మినహా మరే సీరియల్ లో కనిపించని ప్రేమీ విశ్వనాథ్ రామ్ హీరోగా ప్రస్తుతం తెరకెక్కుతున్న ఒక సినిమాలో కీ రోల్ లో కనిపించనున్నారని తెలుస్తోంది.

ఒక యాడ్ షూట్ కొరకు వంటలక్క కొత్త లుక్ లోకి మారిపోయారు.

Advertisement

అయితే వంటలక్క నటిస్తున్న యాడ్ కు సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది.ఈ యాడ్ షూట్ గురించి తెలిసి కొంతమంది ఈమెతో సెల్ఫీలు దిగడానికి రాగా వాళ్లందరికీ తీరికగా ప్రేమీ విశ్వనాథ్ ఫోజులిచ్చారు.ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో ఈ యాడ్ కు సంబంధించిన షూటింగ్ జరుగుతోంది.

ప్రేమీ విశ్వనాథ్ భవిష్యత్తు సీరియళ్లలో అందంగా కనిపించే పాత్రలను ఎంపిక చేసుకుంటరేమో చూడాల్సి ఉంది.

తెలుగు సీరియల్ కార్తీకదీపంతో పాటు ప్రేమీ విశ్వనాథ్ ఒక మలయాళ సీరియల్ లో కూడా నటిస్తున్నారు.తెలుగులో బ్లాక్ బస్టర్ హిట్టైన కార్తీకదీపం సీరియల్ మలయాళ సీరియల్ కు రీమేక్ అనే సంగతి తెలిసిందే.ప్రేమీ విశ్వనాథ్ పారితోషికం కుడా భారీగా ఉంటుందని రోజుకు 20,000కు పైగా పారితోషికం తీసుకునే నటీమణుల్లో ప్రేమీ విశ్వనాథ్ ఒకరని సమాచారం.

నితిన్ తన నెక్స్ట్ సినిమాను పాన్ ఇండియా డైరెక్టర్ తో చేస్తున్నాడా..?
Advertisement

తాజా వార్తలు