కార్తీకదీపం సీరియల్ లోని శోభాశెట్టి పాత్రను ప్రేక్షకులు సులువుగా మరిచిపోలేరు.మోనిత పాత్రలో అద్భుతంగా నటించి శోభా శెట్టి మెప్పించారు.
ఈ సీరియల్ ద్వారా ప్రేమీ విశ్వనాథ్ కు ఏ స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ దక్కిందో శోభా శెట్టికి కూడా అదే స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ దక్కింది.కార్తీకదీపం సీరియల్ ముగియడంతో ఫ్యాన్స్ ఫీలవుతున్నా త్వరలో కార్తీకదీపం సీజన్2 వచ్చే ఛాన్స్ ఉందని కామెంట్లు వినిపిస్తున్నాయి.
అయితే శోభా శెట్టి తనకు పెళ్లి చూపులంటూ ఒక వీడియోను సోషల్ మీడియా వేదికగా షేర్ చేయగా ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.ఈరోజు నాకు పెళ్లిచూపులు అంటూ వీడియోలో శోభాశెట్టి తెగ సిగ్గుపడి పోయారు.
పెళ్లిచూపులు వర్డ్ చెప్పడానికి సిగ్గు పడుతున్నానని ఆమె కామెంట్లు చేశారు.ఈరోజు నా బర్త్ డే అని శోభా శెట్టి పేర్కొన్నారు.
ఈరోజే పెళ్లి చూపులు కావడంతో పక్కా ట్రెడిషనల్ గా రెడీ అవుతున్నానని ఆమె తెలిపారు.
ఇంట్లో సత్యనారాయణ వ్రతం కూడా జరుగుతోందని శోభా శెట్టి చెప్పుకొచ్చారు.తొలిసారి పట్టు శారీ ధరిస్తున్నానని ఆమె కామెంట్లు చేశారు.నాకు గాజులు అంటే చాలా చాలా ఇష్టమని శోభా శెట్టి వెల్లడించారు.
శారీ లుక్ లో శోభా శెట్టి మెరిసిపోయారు.నా లుక్ నాకు ఎంతగానో నచ్చిందని ఆమె తెలిపారు.
అనుకున్న నగలు అంతగా సెట్ కాలేదని శోభా శెట్టి వెల్లడించారు.తర్వాత వీడియోలో మరిన్ని వివరాలను ఆమె చెప్పుకొచ్చారు.
శోభా శెట్టి వీడియోకు రికార్డ్ స్థాయిలో వ్యూస్ వస్తున్నాయి.నెక్స్ట్ వీడియోలో శోభా శెట్టి పెళ్లికి సంబంధించిన వివరాలను సైతం వెల్లడించాలని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు.శోభా శెట్టికి ప్రస్తుతం ఇతర సీరియళ్లలో కూడా ఆఫర్లు వస్తున్నాయి.కార్తీకదీపం సక్సెస్ తో ఆమె రెమ్యునరేషన్ కూడా భారీగా పెరిగిందని సమాచారం.శోభా శెట్టి తర్వాత వీడియో గురువారం రోజున రిలీజ్ కానుందని బోగట్టా.ఈ ఏడాదే శోభా శెట్టి పెళ్లి జరగనుందని సమాచారం అందుతోంది.