ఎన్నికల సమయంలో కాంగ్రెస్ కు ఎదురు దెబ్బలు... బీజేపీకి కలిసి వచ్చే అంశాలు

ఒకవైపు కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలు( karnataka ) ముంచుకొస్తున్నాయి.ఈ సమయం లో అధికారంలోకి రావాలని పట్టుదలతో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఎదురు దెబ్బలను ఎదుర్కొంటుంది.

ఇప్పటికే దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ బలహీనమైంది.అధినేత సరిగా లేక పోవడంతో పాటు పలు కారణాల వల్ల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని నమ్మకం ఏ ఒక్కరిలో కనిపించడం లేదు అంటూ రాజకీయ విశ్లేషకులు మరియు మీడియా వర్గాల వారు మాట్లాడుకుంటున్నారు.

ఇప్పుడు అదే స్థాయిలో కర్ణాటకలో కూడా కాంగ్రెస్( Congress ) పరిస్థితి మారింది అంటూ రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.కాంగ్రెస్ పార్టీ లో ఇన్నాళ్లు కొనసాగుతూ వచ్చిన కొంత మంది ఎమ్మెల్యేలు మరియు మాజీ మంత్రులు త్వరలోనే జేడీఎస్‌ పార్టీ లేదా బిజెపి లో జాయిన్ అయ్యేందుకు సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది.

ప్రస్తుతం కేంద్రంలో అధికాంలో ఉండటంతో పాటు రాష్ట్రంలో కూడా అధికార పార్టీ అయిన బీజేపీ ప్రస్తుతం కాంగ్రెస్‌ పార్టీ నాయకులను ఆకర్షించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ మరియు జేడీఎస్( JDS ) బలం పెరగుతున్నా కొద్ది కాంగ్రెస్ పార్టీ బలం తగ్గుంది అంటూ కొందరు మీడియా వ్యవహారాలు చూసే వారు కామెంట్స్ చేస్తున్నారు.మొత్తానికి కర్ణాటకలో మళ్లీ గౌరవప్రదమైన స్థానం ను సొంతం చేసుకోవాలని భావిస్తున్న కాంగ్రెస్ కి జంపింగ్ ల వల్ల పెద్ద సమస్యగా మారింది అంటూ రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

ప్రస్తుతం కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల కోసం కాంగ్రెస్ ఏ విధంగా సహాయత్తమవుతుంది అంటే మౌనమే సమాధానంగా లభిస్తుంది.రాష్ట్రంలో నాయకత్వం బలంగా లేకపోవడం వల్ల ఎన్నికల్లో గెలుపు గురించి నమ్మకం లేదని అందుకే ప్రతిపక్ష పార్టీలకు వెళ్లడం మంచిదని నిర్ణయానికి వచ్చినట్లుగా కొందరు చెబుతున్నారు.ఇప్పటికైనా వెంటనే పార్టీ మారేవారిని ఆపకుంటే కాంగ్రెస్ పరిస్థితి దారుణంగా మారే అవకాశాలు ఉన్నాయి అంటూ టాక్ వినిపిస్తుంది.

'హెలికాప్టర్ ' కోసం ఇంత పంచాయతీ జరుగుతోందా ? 
Advertisement

తాజా వార్తలు