ఏపీలో రాజకీయ పరిస్థితులు వేగంగా మారిపోతున్నాయి.మొన్నటి వరకు అన్ని వర్గాల ప్రజలలోను ఏపీ సీఎం జగన్ పై సానుకూలత ఉన్నట్టుగా కనిపించినా, ఇప్పుడు ఎక్కడా ఆ పరిస్థితి కనిపించడం లేదు.
ఒక్కో వర్గం వైసిపి ప్రభుత్వానికి దూరం అవుతూ వస్తోంది.ఈ పరిస్థితిని తమకు అనుకూలంగా మార్చుకునేందుకు జనసేన , తెలుగుదేశం పార్టీలు ప్రయత్నాలు చేస్తున్నాయి.
ఇదిలా ఉంటే ఏపీ రాజకీయాలను కీలక మలుపు తిప్పగల శక్తిసామర్థ్యాలు ఉన్న కాపు సామాజికవర్గం ఆలోచన కూడా ఇప్పుడిప్పుడే మారుతోంది. 2019 ఎన్నికల్లో జనసేన వైపు కొంత మంది మొగ్గు చూపించినా, ఎక్కువ మంది టిడిపి పై ఉన్న ఆ గ్రహం కారణంగా వైసిపి కి మద్దతుగా నిలబడ్డారు.
ఇక 2014 ఎన్నికల సమయంలో కాపు సామాజిక వర్గం టిడిపి వైపు నిలబడింది.అప్పట్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ టీడీపీ కి మద్దతుగా నిలబడడం ఇవన్నీ అప్పట్లో టిడిపి అధికారంలోకి వచ్చేలా చేశాయి.2019 ఎన్నికల్లో కాపుల సహకారం తో వైసీపీ సునాయాసంగా అధికారంలోకి వచ్చింది.అయితే ఇప్పుడిప్పుడే వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాపు సామాజిక వర్గం ముందుకు వెళుతున్నట్లుగా కనిపిస్తోంది.
ఈ మేరకు కొద్ది రోజుల క్రితమే అన్ని పార్టీల్లోని కాపు సామాజిక వర్గం నాయకులు హైదరాబాద్ లో సమావేశం అయ్యారు.
తర్వాత విశాఖలో ఈ తరహ సమావేశాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా వైసీపీ ప్రభుత్వం లో కాపులు అన్ని రకాలుగా ఇబ్బందులుఎదుర్కొంటున్నారని, జగన్ ప్రభుత్వం కారణంగా కాపులకు ఒరిగిందేమీ లేదు అనే అభిప్రాయాలు వ్యక్తం చేశారు.ఈ క్రమంలోనే జనసేన పరిస్థితి 2024 ఎన్నికల సమయానికి మెరుగుపడితే, ఆ పార్టీకి మద్దతుగా నిలబడాలని , లేకపోతే టిడిపి కి జై కొట్టడమే బెటర్ అన్న అభిప్రాయంలో ఉన్నారట.
ఈ పరిణామాలు వైసీపీలో ఆందోళన కలిగిస్తున్నాయి.
.