విజయవాడలో వైయస్ జగన్ “మేమంతా సిద్ధం” బస్సు యాత్ర జరుగుతోంది.ఈ క్రమంలో సరిగ్గా సింగ్ నగర్ చేరుకున్నాక.
సీఎం జగన్ ఎడమ కంటిపై రాయితో దాడి చేయడం జరిగింది.దాడి జరిగిన అనంతరం.
రక్తం రావడంతో వెంటనే బస్సు పై నుండి.లోనికి వెళ్లి ప్రథమ చికిత్స చేయించుకున్నారు.
సీఎం జగన్ పై విజయవాడలో దాడి జరగటం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది.సీఎం జగన్ కి తాకిన రాయి పక్కనే ఉన్న ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్( vellampalli srinivas ) కి కూడా తాకింది.
ఆయనకి కూడా స్వల్పంగా గాయం కావడం జరిగింది.ఈ క్రమంలో సీఎం జగన్( CM Jagan ) పై రాయి దాడి ఘటనపై మంత్రి అంబటి రాంబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు.
వైయస్ జగన్ కి వస్తున్న ప్రజాదరణ తట్టుకోలేక చంద్రబాబు దుర్మార్గమైన ఆలోచనలు చేస్తున్నారని విమర్శించారు.చంద్రబాబు( Chandrababu ) ప్రోత్బలంతోనే దాడి జరిగిందని వ్యాఖ్యానించారు.ఎన్నికలలో మళ్లీ అధికారంలోకి రాలేమని.ఓడిపోతామని.చంద్రబాబు ఈ రకమైన దాడులకు పాల్పడుతున్నారని అంబటి రాంబాబు( Ambati Rambabu) తన అభిప్రాయం వ్యక్తం చేశారు.చంద్రబాబు మరియు లోకేష్ కలసి కుట్ర చేసి విజయవాడ నడిబొడ్డులో జగన్ పై దాడి చేయించారని ఆరోపించారు.
అత్యంత ప్రజాదారణ పొందుతున్న వైఎస్ జగన్ ని ఎదుర్కోలేక రాళ్లతో దాడులు చేస్తున్నారు.కచ్చితంగా చంద్రబాబు మూల్యం చెల్లించుకుంటారని మంత్రి అంబటి వ్యాఖ్యానించారు.