కాంతార ను తెలుగు రాష్ట్రాల్లో వారు పట్టించుకోవడం లేదా?

రిషబ్‌ శెట్టి ప్రధాన పాత్రలో తెరకెక్కిన కాంతార సినిమా కన్నడ నాట భారీ విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.

కన్నడం లో సినిమా అంటే 10 కోట్లు 20 కోట్లు కలెక్ట్ చేయడం గొప్ప విషయం, కానీ ఈ సినిమా ఇప్పటికే 100 కోట్ల కలెక్షన్స్ పూర్తి చేసుకుంది.

తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ సినిమా మంచి కలెక్షన్స్ రాబడుతున్న నేపథ్యం లో అంతా కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.త్వరలోనే సినిమా భారీ వసూళ్లను సొంతం చేసుకుంటుందని అంతా భావిస్తున్నారు.

కానీ ఈ సినిమా కు తెలుగు రాష్ట్రాల్లో బి సి సెంటర్స్ లో ఆశించిన స్థాయిలో కలెక్షన్స్ రావడం లేదు.కానీ మల్టీప్లెక్స్ నుండి భారీగా వసూళ్లు వస్తున్న నేపథ్యం లో ఈజీగా 50 కోట్లను మించి ఈ సినిమా రాబడుతుందనే నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నారు.

Kantara Movie Telugu Collections Going To Big , Flim News, Kannada Movie, Kantar

తెలుగు లో ఈ సినిమా ను అల్లు అరవింద్ కొనుగోలు చేసి విడుదల చేశారు.హీరో ఈ సినిమా లో పోషించిన పాత్ర కు ప్రతి ఒక్కరు ఫీదా అవుతున్నారు.కే జీ ఎఫ్ సినిమా ను నిర్మించిన నిర్మాణ సంస్థ ఈ సినిమా ను నిర్మించడం తో అక్కడ ఇక్కడ భారీగానే స్పందన లభిస్తుంది.

Advertisement
Kantara Movie Telugu Collections Going To Big , Flim News, Kannada Movie, Kantar

మొత్తానికి ఈ సినిమా కు సంబంధించిన వసూళ్లు అక్కడ ఇక్కడ భారీ గా వస్తున్న నేపథ్యం లో 100 కోట్ల కు పైగా లాభాలు వస్తాయని అంతా భావిస్తున్నారు.లాభాల విషయం పక్కన పెడితే కన్నడ సినిమా మరో సారి పాన్ ఇండియా రేంజ్ లో సత్తా చాటింది.

కేజీఎఫ్ వంటి సినిమా వందల కోట్ల వసూళ్లు నమోదు చేయడం ఏమో కానీ కాంతర వంటి సింపుల్‌ సినిమా ఈ స్థాయి వసూళ్లు నమోదు చేయడం మామూలు విషయం కాదు.

Advertisement

తాజా వార్తలు