వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ కు భారత్.. లైన్ క్లియర్ చేసిన కేన్ విలియమ్సన్..!

వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ కు భారత్ (India).లైన్ క్లియర్ చేసిన న్యూజిలాండ్ ప్లేయర్ కేన్ విలియమ్సన్.

ప్రస్తుతం భారత్- ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న నాలుగో టెస్ట్ లో భారత్ గెలిచిన, ఓడిన, లేదంటే డ్రా చేసుకున్న పెద్దగా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు.

శ్రీలంక- న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న రెండు టెస్ట్ మ్యాచ్ల సిరీస్ లో శ్రీలంక రెండు మ్యాచ్లలో విజయం సాధిస్తే, శ్రీలంక ఫైనల్ కు చేరి, ఇండియాను ఇంటికి పంపించేది.కానీ శ్రీలంక(Sri lanka) తొలి మ్యాచ్లో న్యూజిలాండ్ చేతిలో ఘోరంగా ఓడిపోవడంతో భారత్ కు లైన్ క్లియర్ అయింది.ఇప్పటివరకు ఉన్న ఉత్కంఠకు తెర పడింది.

లండన్ లోని ఓవల్ స్టేడియంలో జూన్ 7-11 మధ్య జరిగే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో ఆస్ట్రేలియాతో భారత్ తలపడనుంది.దీనితో రెండుసార్లు వరుసగా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ కు చేరిన జట్టుగా భారత్ రికార్డ్ పొందింది.

Advertisement

శ్రీలంక- న్యూజిలాండ్ టెస్ట్ సిరీస్ లో 285 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన న్యూజిలాండ్ రెండు వికెట్ల తేడాతో విజయం సాధించి, శ్రీలంక ఆశలపై నీళ్లు చల్లింది.కేన్ విలియమ్సన్ 121 పరుగులు(kane williamson) చేసి నాట్ అవుట్ గా నిలవడంతో భారత్ కు లైన్ క్లియర్ అయింది.ఇక డారిల్ మిచెల్ 81 పరుగులు చేసి న్యూజిలాండ్ విజయంలో భాగస్వామి అయ్యాడు.

శ్రీలంక తొలి ఇన్నింగ్స్ లో 355 పరుగులు చేయగా.న్యూజిలాండ్ 373 పరుగులు చేసి 18 పరుగుల ఆధిక్యం సాధించింది.

రెండో ఇన్నింగ్స్ లో శ్రీలంక 302 పరుగులకే ఆల్ అవుట్ అయింది.రెండో ఇన్నింగ్స్ లో 285 పరుగుల లక్ష్యాన్ని ఛేదించి న్యూజిలాండ్ టెస్ట్ 1-0 ఆధిక్యం లోకి వెళ్ళింది.డబ్ల్యూటీసీ(World Test Championship) పాయింట్ల టేబుల్ లో ఆస్ట్రేలియా (68.52 శాతం) మొదటి స్థానంలో ఉంది.ఇక భారత్ (60.29 శాతం) రెండో స్థానంలో కొనసాగుతుంది.కాబట్టి నాలుగో టెస్ట్ ఎలా ముగిసిన కూడా పెద్దగా టెన్షన్ ఏమీ లేకుండా భారత్ ఫైనల్ కు వెళ్తుంది.

కూతురి పెళ్లి వీడియో షేర్ చేసిన అర్జున్ సర్జా... మాటలు రావడం లేదంటూ పోస్ట్?
Advertisement

తాజా వార్తలు