అమెరికా అధ్యక్ష ఎన్నికలు : ట్రంప్‌పై కమలా హారిస్ పైచేయి.. వైరల్ అవుతోన్న కొత్త సర్వే!!

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో కమలా హారిస్, డొనాల్డ్ ట్రంప్‌లు ( Kamala Harris , Donald Trump )దూసుకెళ్తున్నారు.

ఇప్పటికే పలు రాష్ట్రాల్లో ముందుస్తు ఎన్నికలు ప్రారంభమవగా.

ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు.డెమొక్రాటిక్ అభ్యర్ధిగా జో బైడెన్( Joe Biden ) తప్పుకున్న తర్వాత రేసులోకి వచ్చిన కమల హారిస్ .ట్రంప్‌కు గట్టిపోటీ ఇస్తున్నారు.తాజాగా వెలువడిన ముందస్తు సర్వేలో ట్రంప్‌పై 7 పాయింట్ల ఆధిక్యంలో ఉన్నారు.రాయిటర్స్, ఇప్సోస్ సర్వే ప్రకారం కమలా హరిస్ 46.61 శాతం మంది మద్ధతుతో ముందంజలో ఉండగా. ట్రంప్‌కు 40.80 శాతం మంది సపోర్ట్ చేస్తున్నారు.గతంలో పోలిస్తే కమలకు మద్దతు పలికేవారి సంఖ్య స్వల్పంగా పెరిగింది.

ఆర్ధిక వ్యవస్ధ, నిరుద్యోగం, ఇమ్మిగ్రేషన్ వంటి అంశాలు ఎన్నికల్లో ప్రభావం చూపుతున్నాయని విశ్లేషకులు అంటున్నారు.

ఆర్ధిక వ్యవస్ధను గాడిలో పెట్టి ఉద్యోగావకాశాలను కల్పిస్తారని ట్రంప్‌పై ఓ వర్గం నమ్మకాలు పెట్టుకోగా.ఇప్పుడిప్పుడే కమలా హారిస్ ఆ గ్రూప్ అభిమానాన్ని పొందుతున్నట్లుగా సర్వే చెబుతోంది.ఆగస్ట్ నుంచి ఆమె స్థిరమైన పాయింట్లతో ఆధిక్యాన్ని కనబరుస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.

Advertisement

ట్రంప్‌తో జరిగిన ప్రెసిడెన్షియల్ డిబేట్( Presidential Debate ) తర్వాత ఆమెకు మద్ధతు పెరుగుతోందని విశ్లేషకులు అంటున్నారు.గృహాలు, పన్ను తగ్గింపులు, నిరుద్యోగంపై తమ ప్రణాళికలను అభ్యర్ధులిద్దరూ ఓటర్లకు స్పష్టంగా తెలియజేస్తున్నారు.

అమెరికాలోని కొన్ని రాష్ట్రాల్లో నిర్ణయాత్మక శక్తిగా ఉన్న ప్రవాస భారతీయుల మద్ధతు కోసం ట్రంప్, హారిస్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.

కాగా.ఇటీవల అమెరికా పర్యటన సందర్భంగా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను కలవకుండానే భారత ప్రధాని నరేంద్ర మోడీ( Indian Prime Minister Narendra Modi ) తిరిగి స్వదేశానికి వచ్చేయడం రెండు దేశాల్లో చర్చనీయాంశమైంది.ట్రంప్ సైతం మోడీ తనను కలవబోతున్నారని ఎన్నికల ప్రచారంలో గొప్పగా చెప్పుకున్నారు.

కట్ చేస్తే .తన అధికారిక కార్యక్రమాలను ముగించుకుని అమెరికాను వీడారు మోడీ.భారత ప్రధానితో భేటీ ద్వారా ఇండియన్ కమ్యూనిటీకి బలమైన సంకేతాలను పంపాలని ట్రంప్ ఆశించగా.

నా ఇంట్లో నాగవంశీ ఫోటో పెట్టుకుంటాను.. దుల్కర్ సల్మాన్ కామెంట్స్ వైరల్!
ఆ రెండు శాఖలపై చంద్రబాబు ఫోకస్ .. నేడు సమీక్ష

ఆయన ఆశలపై మోడీ నీళ్లు చల్లారు.

Advertisement

తాజా వార్తలు