తమిళనాడు రాష్ట్రంలో నిన్న అసెంబ్లీ ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే.234 అసెంబ్లీ స్థానాలకు తొమ్మిది వందల తొంభై ఎనిమిది మంది అభ్యర్థులు పోటీ పడటం జరిగింది.ఇదిలా ఉంటే మక్కల్ నీది మయ్యమ్ అధినేత కమల్ హాసన్ కోయంబత్తూరు దక్షిణ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు.నిన్న తన ఇద్దరు కూతుర్లు అక్షర హాసన్, శృతి హాసన్ లతో వచ్చి మైలాపురం లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.
ఆ తర్వాత తాను పోటీ చేస్తున్న నియోజకవర్గంలో ఎన్నికల ఏర్పాట్లు ఎలా ఉన్నాయో ప్రత్యేక విమానంలో గమనించారు.ఈ సందర్భంగా అక్కడ మీడియాతో మాట్లాడుతూ ఈ ప్రాంతాలలో ఓటర్లకు నోట్లు మరియు టోకెన్లను పంపిణీ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
అంతేకాకుండా ఓటర్లకు డబ్బులు ఎవరు పంచి పెట్టారో వారి వివరాలు తన దగ్గర ఉన్నట్లు స్పష్టం చేశారు.దీంతో వీటిని ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకు వెళ్లి మళ్లీ రీ పోలింగ్ నిర్వహించాలని డిమాండ్ చేయబోతున్నట్లు కమల్ హాసన్ స్పష్టం చేశారు.
దాదాపు తమిళనాడు రాష్ట్రంలో చాలా నియోజకవర్గాల్లో ఇదే పరిస్థితి నెలకొంది అని పేర్కొన్నారు.పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించడం లో ఎన్నికల కమిషన్ విఫలమైందని, కాబట్టి రీ పోలింగ్ నిర్వహించాలని కమల్ హాసన్ పేర్కొన్నారు.