హైదరాబాద్ లో తెరాస 21వ ఆవిర్భావ దినోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది.రాష్ట్ర నలుమూలల నుండి పార్టీ కార్యకర్తలు ప్రజాప్రతినిధులు మొత్తంగా మూడు వేల మంది హాజరయ్యారు.
ఈ క్రమంలో కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి పార్టీ పై కెసిఆర్ తన మొదటి ప్రసంగంలో వ్యాఖ్యలు చేశారు.ఇక ఇదే సమయంలో పార్టీ తీర్మానాలు కూడా ప్రవేశపెట్టడం జరిగింది వాటిని క్షుణ్ణంగా పరిశీలిస్తే.
1.యాసంగిలో వరి ధాన్యాన్ని కేంద్రం కొనుగోలు చేయకపోయినా రాష్ట్రప్రభుత్వమే కొనుగోలుచేస్తున్నందుకు అభినందన తీర్మానం.
2.దేశం విస్తృత ప్రయోజనాలరీత్యా జాతీయ రాజకీయాల్లో టీఆర్ఎస్ పార్టీ కీలక భూమిక పోషించాలని రాజకీయ తీర్మానం.
3.ఆకాశాన్ని అంటేలా ధరలు పెంచుతూ పేద, మధ్యతరగతి ప్రజల మీద మోయలేని భారం వేస్తున్న కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ, ధరల నియంత్రణను డిమాండ్ చేస్తూ తీర్మానం.
4.చట్టసభల్లో మహిళలకు 33శాతం రిజర్వేషన్ బిల్లును పార్లమెంటులో ఆమోదింపజేసి, అమలు చేయాలని డిమాండ్ చేస్తూ తీర్మానం.
5.భారతదేశ సామరస్య సంస్కృతిని కాపాడుకోవాలని, మతోన్మాదానికి వ్యతిరేకంగా పోరాడాలని తీర్మానం.
6.బీసీ వర్గాలకు కేంద్ర ప్రభుత్వంలో బీసీ సంక్షేమ మంత్రిత్వశాఖ ఏర్పాటు చేయాలనీ బీసీ వర్గాల జనగణన జరపాలని డిమాండ్ చేస్తూ తీర్మానం.
7.తెలంగాణ రాష్ట్ర సామాజిక పరిస్థితులకు అనుగుణంగా రిజర్వేషన్ శాతం పెంచాలని కేంద్రాన్ని డిమాండ్ చేస్తూ తీర్మానం.
8.రాష్ట్రాల ఆదాయానికి గండి కొడుతూ కేంద్రం పన్నుల రూపంలో కాకుండా సెస్ ల రూపేణా వసూలు చేయడం మానుకోవాలనీ, డివిజబుల్ పూల్ లోనే పన్నులు వసూలు చేయాలని తీర్మానం.

9.నదీజలాల వివాద చట్టం సెక్షన్ – 3 ప్రకారం కృష్ణా జలాల్లో తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన వాటా నిర్ణయించాలని, ఈ మేరకు బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ కు కేంద్రం రిఫర్ చేయాలని డిమాండ్ చేస్తూ తీర్మానం.
10.భారత రాజ్యాంగం ప్రతిపాదించిన సమాఖ్య విలువలను కాలరాస్తున్న కేంద్ర ప్రభుత్వ అప్రజాస్వామిక వైఖరికి వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిస్తూ తీర్మానం.
11.తెలంగాణ రాష్ట్రంలో నవోదయ విద్యాలయాలను, వైద్య కళాశాలలను వెంటనే చేయాలని కేంద్రాన్ని డిమాండ్ చేస్తూ తీర్మానం.
12.దళితబంధు పథకాన్ని దేశవ్యాప్తంగా కేంద్రం అమలుచేయాలని డిమాండ్ చేస్తూ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య తీర్మానం ప్రతిపాదిస్తారు.
13.చేనేత వస్త్రాలపై కేంద్ర ప్రభుత్వం విధించిన జీఎస్టీని పూర్తిగా రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ, చేనేత రంగాన్ని దెబ్బతీస్తున్న కేంద్ర ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ తీర్మానం ప్రవేశటానున్నారు.







