తండ్రి తరహాలో దర్శకురాలిగా మారబోతున్న అఖిల్ హీరోయిన్

దర్శకుడు ప్రియదర్శన్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.

మలయాళీ ఇండస్ట్రీ నుంచి బాలీవుడ్ వరకు వెళ్లిన అతని ప్రయాణమే దర్శకుడుగా అతని గొప్పతనం చెబుతుంది.

అంతటి గొప్ప దర్శకుడి కూతురుగా హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన భామ కళ్యాణి ప్రియదర్శన్.హలో సినిమాతో తెలుగులో తెరంగేట్రం చేసిన ఈ అమ్మడు చేసిన సినిమాలు తక్కువే అయినా మంచి గుర్తింపు తీసుకొచ్చే పాత్రలే చేసింది.

ఆ సినిమా తర్వాత రణరంగం, చిత్రలహరి సినిమాలలో కళ్యాణి సందడి చేసింది.తెలుగుతో పాటు తమిళ్, మలయాళీ భాషలలో కూడా హీరోయిన్ గా ఈ భామకి అవకాశాలు పుష్కళంగానే ఉన్నాయి.

ప్రస్తుతం కళ్యాణి ప్రియదర్శన్ ప్రముఖ దర్శకులు గౌతమ్‌ వాసుదేవ మీనన్‌, సుధా కొంగర, రాజీవ్‌ మీనన్‌, కార్తీక్‌ సుబ్బరాజ్‌, సుహాసిని మణిరత్నం సంయుక్తంగా దర్శకత్వం వహిస్తున్న ఆంథాలజీ పుత్తమ్‌ పుదు కాలైలో నటిస్తుంది.ఇలమై ఇదో ఇదో అనే కథకు సుధా కొంగర దర్శకత్వం వహిస్తున్నారు.

Advertisement

ఈ కథలో కాళిదాస్‌ జయరామ్‌, ఊర్వశి, కళ్యాణి ప్రియదర్శన్‌ నటిస్తున్నారు.దీని గురించి కళ్యాణి ప్రియదర్శన్‌ మాట్లాడుతూ ఇలమై ఇదో ఇదో చిత్రీకరణ మూడు రోజుల పాటు జరిగింది.సెట్‌లో ఐదుగురు మాత్రమే ఉండేవాళ్ళం.

నా మేకప్‌ ను నేనే వేసుకున్నాను.ఈ అనుభవం వింతగా అనిపించింది.

మా నాన్న మాదిరిగానే నేను కూడా సినిమాలకు దర్శకత్వం వహించాలనే ధృడ నిర్ణయంతో ఉన్నాను అని చెప్పారు.మొత్తానికి తండ్రి తరహాలో ఈ అమ్మడు దర్శకత్వం వైపు వచ్చి ఎంత వరకు గుర్తింపు తెచ్చుకుంటుంది అనేది ఇప్పుడు చూడాలి.

కల్యాణి దారిలోనే మరో మలయాళీ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ అలాగే నిత్యా మీనన్ కూడా దర్శకత్వం వైపు ద్రుష్టి సారిస్తున్నారు.

వీడియో వైరల్ : శోభనం గదిలో ఆలియా, రణ్ వీర్.. ఇదే తొలిసారి అంటూ..

Advertisement

తాజా వార్తలు