కళ్యాణ్ రామ్ అంత మాట అనేశాడేంటి.. తారక్ గుడ్డుపై ఈకలు పీకే రకమా?

కళ్యాణ్ రామ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఎంతో సన్నిహితంగా ఉంటారనే సంగతి తెలిసిందే.

ఛాన్స్ వచ్చిన ప్రతి సందర్భంలో కళ్యాణ్ రామ్, తారక్ ఒకరిపై ఒకరు ప్రేమను చాటుకుంటూ ఉంటారు.

ఒకే తల్లి కడుపున పుట్టకపోయినా ఒకరి శ్రేయస్సును మరొకరు కోరుకునే హీరోలుగా ఈ ఇద్దరు హీరోలకు పేరుంది.యంగ్ టైగర్ ఎన్టీఆర్ గుడ్డుపై ఈకలు పీకే రకమని కళ్యాణ్ రామ్ షాకింగ్ కామెంట్లు చేశారు.

తమ్ముడు తారక్ అనుమతితోనే తాను బింబిసార మూవీలో నటించానంటూ కళ్యాణ్ రామ్ షాకింగ్ విషయాలను వెల్లడించారు.తన సినిమాల విషయంలో, లుక్, కథ, ఇతర విషయాలలో తారక్ దే తుది నిర్ణయమని కళ్యాణ్ రామ్ చెప్పుకొచ్చారు.

తారక్ ఓకే చెబితే మాత్రమే అవి జనాల ముందుకు వస్తాయని కళ్యాణ్ రామ్ చెప్పుకొచ్చారు.ప్రొఫెషనల్ విషయాలకు సంబంధించి తారక్ మొహమాటం లేకుండా ఉంటారని కళ్యాణ్ రామ్ పేర్కొన్నారు.

Advertisement

కెరీర్ విషయంలో తారక్ ఫేస్ టు ఫేస్ ఉంటారని కళ్యాణ్ రామ్ చెప్పుకొచ్చారు.తప్పులను దాచుకోవడం తారక్ కు నచ్చదని కళ్యాణ్ రామ్ తెలిపారు. ఏదైనా నచ్చకపోతే తారక్ గుడ్డు మీద ఈకలు పీకుతారని కళ్యాణ్ రామ్ చెప్పుకొచ్చారు.

తారక్ మార్పులు చెబితే ఆయన చెప్పిన విషయాలకు అనుగుణంగా కచ్చితంగా మార్పులు చేస్తానని కళ్యాణ్ రామ్ చెప్పుకొచ్చారు. బింబిసార కథ చెప్పిన సమయంలో బాహుబలి గుర్తొచ్చిందని కళ్యాణ్ రామ్ అన్నారు.

బింబిసార రోల్ లో ప్రేక్షకులు ఏ విధంగా రిసీవ్ చేసుకుంటారో అనే భయం ఇప్పటికీ వెంటాడుతోందని కళ్యాణ్ రామ్ చెప్పుకొచ్చారు.కళ్యాణ్ రామ్ చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

కళ్యాణ్ రామ్ తర్వాత ప్రాజెక్ట్ లతో కూడా విజయాలను అందుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.సినిమాసినిమాకు కళ్యాణ్ రామ్ రేంజ్ పెరుగుతోంది.

ఎన్టీఆర్ ఫ్యాన్స్ సపోర్ట్ లేకుండా డాకు మహారాజ్ హిట్టవుతుందా.. ఆ రేంజ్ కలెక్షన్లు వస్తాయా?
Advertisement

తాజా వార్తలు