తాజా పంచాయతీ ఎన్నికల పరిణామాలు టీడీపీ అధినేత చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరులో తీవ్ర కలవరానికి గురి చేస్తున్నాయి.ముఖ్యంగా పంచాయతీ ఎన్నికల్లో జిల్లాలో టీడీపీ తుడిచి పెట్టుకుపోయిం ది.
దీనికితోడు ఎక్కడికక్కడ వైసీపీ దూకుడు పెరిగింది.మంత్రి, ఎమ్మెల్యేల దూకుడుతో టీడీపీ శ్రేణులు బయటకు వచ్చేందుకు కూడా జడిసే పరిస్థితి ఏర్పడింది.
దీనిపై చంద్రబాబుకు కూడా సమాచారం ఇచ్చారు.అయినా ఆయన పెద్దగా తమ్ముళ్లకు భరోసా ఇచ్చేందుకు ఆసక్తి చూపించలేక పోయారనే విమర్శలు వున్నాయి.
అయితే ఇక్కడి పరిస్థితులపై ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదులు చేయడం వరకే చంద్రబాబు పరిమితమవుతున్నారు తప్ప తమ్ముళ్లను మాత్రం పట్టించుకోవడం లేదు.
ఈ నేపథ్యంలో ఇక, పార్టీ నుంచి బయటకు వచ్చేందుకు తమ్ముళ్లు రెడీ అవుతున్నారనే సంకేతాలు వస్తుండడం గమనార్హం.
వాస్తవానికి జిల్లాలో తొలివిడత పంచాయతీ ఎన్నికల ఫలితాలను చూసి టీడీపీ శ్రేణుల్లో మార్పు కనిపిస్తోంది.అధినేత చంద్రబాబు తీరుతో కార్యకర్తలు విసిగిపోతున్నారు.ఈ పరిస్థితుల్లో పార్టీలో కొనసాగడం వృథా అని నిర్ణయానికి వస్తున్నారు.కొందరు తటస్థంగా ఉండటానికి ఇష్టపడుతుం టే మరి కొందరు పార్టీ మారేందుకు సిద్దమవుతున్నారు.
చిత్తూరులో కొందరు టీడీపీ జిల్లా, మండల నాయకులు పార్టీ పదవులకు రాజీనామా చేశారు.

బాబు ప్రాతినిధ్యం వహించే కుప్పం నియోజక వర్గం విషయానికి వస్తే ద్వితీయ, తృతీయ శ్రేణి నాయకుల్లో అధికశాతం ఇప్పటికే వై సీపీలో చేరిపోయారు.చంద్రబాబుతో సన్నిహితంగా ఉన్న శాంతిపురం, గుడుపల్లె నాయకులు కూడా ఇటీవలే మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, చిత్తూరు ఎంపీ రెడ్డప్ప, కుప్పం నియోజక వర్గ వైసీపీ ఇన్‌చార్జి భరత్ ఆధ్వర్యంలో వైఎస్సార్‌సీపీ కండువా కప్పుకున్నారు.కుప్పంలో మూడో విడత పంచాయతీ ఎన్నికల ప్రక్రియ మొదలైంది.
ఈ ఎన్నికల్లో కూడా వైసీపీ దూకుడు కనిపించే అవకాశం ఉంది.
చంద్రగిరి నియోజకవర్గం విషయానికి వస్తే టీడీపీ నుంచి ఇప్పటికే ముఖ్యమైన నాయకులు ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ఆధ్వర్యంలో పార్టీలో చేరిన విషయం తెలిసిందే.
టీడీపీకి కంచుకోటగా ఉన్న రామచంద్రాపురం మండలంలో వైఎస్సార్‌సీపీ మద్దతుదారులు క్లీన్‌స్వీప్ చేశారు.మొత్తం 10 పంచాయతీల్లోనూ విజయం సాధించారు.
ఈ పరిణామాలపై చంద్రబాబు ఆగ్రహంతో ఉన్నప్పటికీ ఇప్పటికిప్పుడు ఏమీ చేయలేననే ధోరణిలో ఉండడం గమనార్హం.మరి ఏం చేస్తారో చూడాలి.