అమరావతి: ఏపీ గెజిటెడ్ ఉద్యోగుల సంఘం కె.వి.కృష్ణయ్య మాట్లాడుతూ.విభజన చట్టం ప్రకారం మా వేతనాలు తగ్గేందుకు అవకాశం లేదు.
కానీ ప్రభుత్వం ఇచ్చిన పీఆర్సీ తో అందరి వేతనాల్లో కొంత పడుతోంది.విభజన తరువాత ఉద్యోగుల ప్రయోజనాలకు రక్షణ కల్పిస్తామని కేంద్రం చట్టంలో పేర్కొంది.
ప్రభుత్వం జారీ చేసిన పీఆర్సీ జీవోను సవాలు చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాం.డిమాండ్ల పరిష్కారం కోసం ఉద్యమిస్తూనే, న్యాయపరంగాను ముందుకు వెళ్లాలని నిర్ణయం తీసుకున్నాం.
ఈ పిటిషన్ లో ఏపీ ప్రభుత్వం తరపున సీఎస్, ఆర్ధిక శాఖ అధికారులు, రెవెన్యూశాఖ, కేంద్ర హోమ్ శాఖ లను ప్రతివాదులుగా చేర్చాం.