కైకాల చివరి సినిమా అదే... ఆ హీరోయిన్ కి తాతయ్యగా ఆఖరి చిత్రం!

సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ శుక్రవారం తన నివాసంలోనే మరణించారు.

ఇలా కైకాల మరణించడంతో ఆయన సినిమాల గురించి ఆయన సినీ ప్రస్థానం గురించి ఎంతోమంది గుర్తు చేసుకున్నారు.

సుమారు ఆరు దశాబ్దాల సినీ కెరియర్లు 777 సినిమాలలో నటించారు.ఈయన హీరోగా, విలక్షణ నటుడిగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా, నిర్మాతగా ఎంతో గుర్తింపు పొందారు.

ఈయన వయసు పైబడి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న నేపథ్యంలో ఇండస్ట్రీకి గత కొంతకాలంగా దూరంగా ఉన్నారు.అయితే ఈయన చివరిసారిగా మహేష్ బాబు పూజా హెగ్డే జంటగా నటించిన మహర్షి సినిమాలో నటించారు.

ఇందులో ఈయన పూజా హెగ్డేకు తాతయ్య పాత్రలో నటించారు.ఈ సినిమాలో పూజ తాత పాత్రలో మహేష్ బాబుతో మాట్లాడుతూ ఒక సన్నివేశంలో కనిపిస్తారు.

Advertisement
Kaikala Satyanarayana Last Movie Maharshi As Grand Father Role To Heroine Pooja

ఇలా మహేష్ బాబుతో ఈయన చివరిసారిగా మహర్షి సినిమాలో నటించారని చెప్పాలి.

Kaikala Satyanarayana Last Movie Maharshi As Grand Father Role To Heroine Pooja

దాదాపు ఆరు దశాబ్దల సినీ కెరియర్ లో ఈయన ఎంతోమంది అగ్ర హీరోల సినిమాలలో నటించి మెప్పించారు.ఈయన అనారోగ్య సమస్యల కారణంగా ఇండస్ట్రీకి దూరంగా ఉంటూ గత కొంతకాలంగా చికిత్స తీసుకుంటూ ఉన్నారు.అయితే శుక్రవారం తెల్లవారుజామున తీవ్ర అనారోగ్యానికి గురి కావడంతో ఈయన మరణించారు.

Advertisement

తాజా వార్తలు