ఉదయ్ కిరణ్ చనిపోయారని ఏఎన్నార్ బాధ పడ్డారట.. అసలేమైందంటే?

వరుస బ్లాక్ బస్టర్ హిట్లతో తక్కువ సమయంలోనే భారీస్థాయిలో క్రేజ్ ను సొంతం చేసుకున్న హీరోలలో ఉదయ్ కిరణ్ ఒకరు.

అయితే ఎవరూ ఊహించని విధంగా వేర్వేరు కారణాల వల్ల ఉదయ్ కిరణ్ ఆత్మహత్య చేసుకున్నారు.

ఉదయ్ కిరణ్ మరణం సినీ పరిశ్రమకు చెందిన ఎంతోమందిని చాలా బాధ పెట్టింది.కాదంబరి కిరణ్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ బావబావ పన్నీరు, అమ్మానాన్న ఓ తమిళ అమ్మాయి, అత్తారింటికి దారేది సినిమాలు తనకు ప్రత్యేక గుర్తింపు తెచ్చిపెట్టాయని తెలిపారు.

ఎంతోమంది కమెడియన్లకు తాను డబ్బింగ్ చెప్పానని కాదంబరి కిరణ్ అన్నారు.ఎల్బీ శ్రీరామ్, ఎమ్మెస్ నారాయణ, వడివేలు, వేణుమాధవ్ కు కొన్ని సినిమాలలో తాను డబ్బింగ్ చెప్పానని కాదంబరి కిరణ్ వెల్లడించారు.

ఆకాశమంత సినిమాలో తాను డబ్బింగ్ చెప్పిన ఒక డైలాగ్ నచ్చి గుండు హనుమంతరావు తనకు బహుమతి ఇచ్చాడని కాదంబరి కిరణ్ అన్నారు.ఏఎన్నార్ గారి చివరి రోజుల్లో తాను ఆయనతో ఉన్నానని కాదంబరి కిరణ్ తెలిపారు.

Advertisement

ఆ పిల్లవాడు ఆ విధంగా చేసి ఉండకూడదని చెబుతూ ఉదయ్ కిరణ్ మరణవార్త గురించి ఏఎన్నార్ బాధ పడ్డారని కాదంబరి కిరణ్ చెప్పుకొచ్చారు.ఎవరైనా తన దగ్గర ఏడిస్తే తనకు అధైర్యం వస్తుందని ఏఎన్నార్ తనతో చెప్పారని కాదంబరి కిరణ్ వెల్లడించారు.

తనకు వేషాలు వేస్తే తప్ప వేరే విధంగా ఆదాయం రాదని కాదంబరి కిరణ్ చెప్పుకొచ్చారు.తన కూతుళ్లు కార్డ్స్ కూడా బ్లాక్ చేశారని కాదంబరి కిరణ్ వెల్లడించారు.

చిరంజీవి 153 సినిమాలలో తాను ఒక్క సినిమాలో మాత్రమే నటించానని కాదంబరి కిరణ్ అన్నారు.చిరంజీవి యుగపురుషుడు అని కాదంబరి కిరణ్ పేర్కొన్నారు.శివాజీరాజా తాను బావాబావమరుదులమని తమ మధ్య గ్యాప్ ఉందని కాదంబరి కిరణ్ చెప్పుకొచ్చారు.

తల్లికి 15 లక్షల విలువ చేసే జ్యూవెలరీ ఇచ్చిన పల్లవి ప్రశాంత్.. ఈ కొడుకు గ్రేట్ అంటూ?
Advertisement

తాజా వార్తలు