ఏఎన్నార్ చనిపోయేముందు ఎవరినీ దగ్గరకు రానీయలేదట.. ఎందుకంటే?

నటుడిగా, నిర్మాతగా తెలుగు ప్రజల హృదయాల్లో చోటు సంపాదించుకున్న అక్కినేని నాగేశ్వరరావు సినీ కెరీర్ లో ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలు ఉన్నాయి.

గుడివాడలోని రామాపురంకు చెందిన అక్కినేని నాగేశ్వరరావు 90 సంవత్సరాల వయస్సులో క్యాన్సర్ తో మరణించారు.

ఏఎన్నార్ చివరి సినిమా మనం కాగా ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే.అయితే ప్రముఖ నటులలో ఒకరైన కాదంబరి కిరణ్ ఏఎన్నార్ చనిపోయే కొన్నిరోజుల ముందు జరిగిన సంఘటనలను ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.

కాదంబరి కిరణ్ మాట్లాడుతూ అక్కినేని నాగేశ్వరరావులో చివరి రోజుల్లో చూసిన ఏకైక మనిషిని తానేనని రమాప్రభ, మరికొందరు నటులు ఏఎన్నార్ ను ఆస్పత్రిలో చూడటానికి వచ్చినా వాళ్లను అనుమతించలేదని కాదంబరి కిరణ్ పేర్కొన్నారు. ఏఎన్నార్ చనిపోవడానికి కొన్ని రోజుల ముందు ఆయన కాలును ముట్టుకుంటే చర్మం వచ్చేదని ఉదయ్ కిరణ్ మరణం గురించి తెలిసి ఆ కుర్రాడు అలా చేసి ఉండకూడదని ఏఎన్నార్ చెప్పారని కాదంబరి కిరణ్ తెలిపారు.

ఏడిస్తే తనకు అధైర్యం వస్తుందనే కారణంతో కొంతమందిని ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్న సమయంలో చూడటానికి ఏఎన్నార్ ఒప్పుకోలేదని కాదంబరి కిరణ్ చెప్పుకొచ్చారు.తనకు క్యాన్సర్ వచ్చినప్పుడు ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పారని ఏఎన్నార్ కు చాలా దగ్గరగా ఉన్నానని కాదంబరి కిరణ్ అన్నారు.అయితే ఏఎన్నార్ చనిపోయిన సమయంలో బాంబేలో ఉండటంతో తాను వెంటనే రాలేకపోయానని కిరణ్ చెప్పుకొచ్చారు.

Advertisement

బాంబేలో మీటింగ్ కోసం వెళ్లానని నా ప్రాణాలను నిలబెట్టిన వ్యక్తులలో ఆయన కూడా ఒకరని కిరణ్ కామెంట్లు చేశారు.కాదంబరి కిరణ్ ప్రస్తుతం సినిమా ఆఫర్లతో బిజీగా ఉన్నారు.

మా అధ్యక్ష పదవికి కూడా కాదంబరి కిరణ్ పోటీ చేస్తున్నట్టు ప్రకటించారు.

Advertisement

తాజా వార్తలు