స్టీల్ ప్లాంట్ హీరోగా మారిపోయిన కేఏ పాల్ ?

కేఏ పాల్ అంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆ పేరుకు మంచి పలుకుబడి ఉంది.

ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడుగానే కాకుండా, పొలిటికల్ కామెడీగానే ఆయనను అందరు చూస్తూ ఉంటారు.

పాల్ చెప్పే విషయాలను నవ్వుకుంటూ హేళన చేస్తూ, కామెంట్స్ చేసుకుంటూ ఉంటారు.దీనికి కారణం తాను ప్రపంచ స్థాయి నాయకుడిని అని, దేశ విదేశాల అధ్యక్షులు ఎంతోమంది తనకోసం ఎదురు చూస్తూ ఉంటారు అని, ఎన్నో యుద్ధాలను ఆపాను అని, ప్రపంచ శాంతి దూతగా అందరూ తనను చూస్తున్నారని ఇలా ఎన్నో చెబుతుంటారు.అందులో వాస్తవం ఉన్నప్పటికీ జనాలు మాత్రం ఆయనను కామెడీగానే చూస్తూ వస్తున్నారు.2019 ఎన్నికలలో ఏపీలో ప్రజాశాంతి పార్టీ తరఫున అభ్యర్థులను నిలబెట్టి , ఆయన కూడా పోటీ చేసి ఓటమి చెందారు.ఇక ప్రధాన రాజకీయ పార్టీల నాయకులు ఎవరూ పాల్ ను పట్టించుకోరు.

అయినా ప్రతి విషయంలోనూ పాల్ తలదూర్చుతూ ఉంటారు.తాజాగా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో బిజెపి మినహా, అన్ని పార్టీలూ దీనిని అడ్డుకుంటామంటూ హడావుడి చేస్తూనే ఉన్నాయి.

కానీ సరైన రూట్ లో మాత్రం అడ్డుకునే ప్రయత్నం చేయడం లేదు.అలాగే బిజెపి పైన ఒత్తిడి చేయలేకపోతున్నాయి.

Advertisement

ఇదే సమయంలో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ, కేఏ పాల్ హైకోర్టులో పిటిషన్ వేశారు.కేంద్రం తీసుకున్న నిర్ణయం సరైనది కాదు అంటూ ఈ పిటిషన్ లో పేర్కొన్నారు.

స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు మొగ్గు చూపిస్తూ కేంద్ర క్యాబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని రద్దు చేయాలని, క్యాపిటివ్ మైనింగ్ అంశంలో విశాఖ స్టీల్ ప్లాంట్ కు లీజు అనుమతులు వచ్చే విధంగా చూడాలంటూ కోరారు.అలాగే స్టీల్ ప్లాంట్ ను కేంద్ర ప్రభుత్వం అభివృద్ధి చేయాలని, అనుమతిస్తే స్టీల్ ప్లాంట్ అభివృద్ధికి విరాళాలు సేకరిస్తాను అని కోరారు.

ఈ పిటిషన్ లో ప్రతివాదులుగా కేంద్ర మైనింగ్ శాఖ, ఆర్థిక శాఖ, విశాఖ స్టీల్ ప్లాంట్, కేంద్ర స్టీల్ శాఖ, ప్రభుత్వ చీఫ్ సెక్రటరీనీ చేర్చారు.దీంతో ఒక్కసారిగా అందరి చూపు పాల్ పై పడింది.

ప్లాంట్ వ్యవహారంలో అన్ని ప్రధాన రాజకీయ పార్టీలపైన ఆశలు పెట్టుకున్న ఉద్యోగులు, వారందరికంటే కే ఏ పాల్ తీసుకున్న చొరవను ప్రశంసిస్తూ, విశాఖ కూర్మన్నపాలెం జంక్షన్ వద్ద పాల్ చిత్రపటానికి స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు పాలాభిషేకం చేసి, ఆయన కు జిందాబాద్ కొట్టారు.దీంతో ఇప్పుడు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అడ్డుకునే అసలైన పొలిటికల్ హీరో అంటూ ఆయనపై ప్రశంసలు కురుస్తున్నాయి.

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీకి పాలాభిషేకం.. బాబుకు భలే షాకిచ్చారుగా!

Advertisement

తాజా వార్తలు