బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు( MLC Kavitha ) రౌస్ అవెన్యూ కోర్టు జ్యుడీషియల్ కస్టడీ విధించింది.ఈ మేరకు కవితను 14 రోజుల పాటు జ్యుడీషియల్ కస్టడీకి( judicial custody ) ఇస్తూ ఆదేశాలు జారీ చేసింది.
ఈ నేపథ్యంలో ఏప్రిల్ 9వ తేదీ వరకు కవిత జ్యుడీషియల్ కస్టడీలో ఉండనున్నారు.కోర్టు ఆదేశాల నేపథ్యంలో ఎమ్మెల్సీ కవితను తీహార్ జైలుకు తరలించనున్నారు.
కాగా ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో( Delhi liquor scam case ) ఎమ్మెల్సీ కవితను ఈడీ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.ఈ క్రమంలోనే ఆమె కస్టడీ ముగియడంతో కవితను జ్యుడీషియల్ కస్టడీకి ఇవ్వాలని కోరుతూ రౌస్ అవెన్యూ కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.
ఈ పిటిషన్ పై విచారణ జరిపిన ధర్మాసనం ఈడీ అభ్యర్థనను పరిగణనలోకి తీసుకుని కవితకు 14 రోజుల పాటు జ్యుడీషియల్ కస్టడీ విధించింది.