MLC Kavitha : ఎమ్మెల్సీ కవితకు జ్యుడీషియల్ కస్టడీ

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు( MLC Kavitha ) రౌస్ అవెన్యూ కోర్టు జ్యుడీషియల్ కస్టడీ విధించింది.

ఈ మేరకు కవితను 14 రోజుల పాటు జ్యుడీషియల్ కస్టడీకి( Judicial Custody ) ఇస్తూ ఆదేశాలు జారీ చేసింది.

ఈ నేపథ్యంలో ఏప్రిల్ 9వ తేదీ వరకు కవిత జ్యుడీషియల్ కస్టడీలో ఉండనున్నారు.

కోర్టు ఆదేశాల నేపథ్యంలో ఎమ్మెల్సీ కవితను తీహార్ జైలుకు తరలించనున్నారు.కాగా ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో( Delhi Liquor Scam Case ) ఎమ్మెల్సీ కవితను ఈడీ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.

ఈ క్రమంలోనే ఆమె కస్టడీ ముగియడంతో కవితను జ్యుడీషియల్ కస్టడీకి ఇవ్వాలని కోరుతూ రౌస్ అవెన్యూ కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.

ఈ పిటిషన్ పై విచారణ జరిపిన ధర్మాసనం ఈడీ అభ్యర్థనను పరిగణనలోకి తీసుకుని కవితకు 14 రోజుల పాటు జ్యుడీషియల్ కస్టడీ విధించింది.

ప్రెగ్నెన్సీ సమయంలో నా గొంతు పోయింది.. సింగర్ ప్రణవి ఆసక్తికర వ్యాఖ్యలు వైరల్!