జూదంలో ఓడి..భార్య శీలాన్ని వేలం పెట్టిన ప్రభుద్దుడు       2018-05-31   00:54:11  IST  Raghu V

ఆ నాడు ధర్మరాజు తన భార్య ద్రౌపతిని పళంగా పెట్టి జూదంలో ఓడి నట్టుగానే ఇప్పుడు కూడా ఒక ప్రబుద్దుడు కట్టుకున్న భార్యని..అందరిని వదులుకుని భర్తే దైవంగా కొలుస్తూ ఉన్న భార్యని డబ్బు కోసం జూదం లో వేలం పెట్టాడు..ఈ జూదంలో ఓడిన భర్త తన భార్యని వేరే వ్యక్తీ వద్దకి బలవంతగా పంపడం సంచలనం సృష్టిస్తోంది..ఒడిసా లోని బాలా సౌర్ లో జరిగిన ఈ ఘటన సభ్యసమాజం ఛీ కొడుతోంది వివరాలలోకి వెళ్తే..

భర్త రోజు తాడుతూనే ఉంటాడు..నిత్యం పేకాట పనిగా పెట్టుకుంటూ వ్యసనాలకి బానిసగా మారిపోయాడు.. ఏప్పటిలాగా జూదంలో డబ్బు పోగొట్టుకున్న అతడు ఈ సారి తన భార్యనే పళంగా పెట్టాడు..అయితే అతడి భార్యపై మోజు పడిన ఒక వ్యక్తి… ఆమెను పందెంలో గెల్చుకున్నాడు. విజయం సాధించినదే తడవుగా ఓ మృగంలా ఆమెను తన గదికి లాక్కుపోయాడు. ప్రతిఘటించిన ఆమెను బలవంతంగా ఆమె భర్త లాక్కొచ్చి అతడికి అప్పగించాడు..

అక్కడితో ఆగకుండా ఆమె భర్త ఆమెని మంచానికి కట్టేసి అతడితో దగ్గరుండి మరీ అత్యాచారం చేయించాడు..ఈ ఘటన మే 23న జరిగిన జరిగింది..భాదిత మహిళ మొదట్లో తన భర్తపై కేసు పెట్టకూడదని అనుకున్నా తరువాత తన భర్తపై పోలీసులకి ఫిర్యాదు చేసింది..ఆమెపై అత్యాచారం చేసిన వ్యక్తిపై , ఆమె భర్తపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు..