తెలంగాణ కాంగ్రెస్ వ్యూహకర్త సునీల్ కనుగోలు పిటిషన్ పై హైకోర్టులో వాదనలు పూర్తయ్యాయి.సైబర్ క్రైం పోలీసులు జారీ చేసిన నోటీసులపై స్టే ఇవ్వాలని కోరుతూ సునీల్ పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.
ఈ పిటిషన్ ను విచారణకు స్వీకరించిన న్యాయస్థానం ఇరు పక్షాల వాదనలు వినింది.అనంతరం తీర్పును సోమవారానికి వాయిదా వేసింది.
అయితే సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ కవితలను కించపరుస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారంటూ సునీల్ కనుగోలుతో పాటు ఆయన బృందంపై పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే.