తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న అల్లరి నరేష్ హీరోగా మాత్రమే కాకుండా స్టార్ హీరోల సినిమాలలో కీలక పాత్రలలో కూడా నటిస్తూ సందడి చేశారు.ఈ క్రమంలోనే సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన మహర్షి సినిమాలో కీలక పాత్రలో నరేష్ నటించారు.
ఈ సినిమాలో నరేష్ పాత్ర చాలా ఎమోషనల్ గా అందరిని కనెక్ట్ అయినప్పటికీ అనుకున్నంత స్థాయిలో ఆయనకు ఈ సినిమా అవకాశాలను తీసుకురాలేకపోయింది.ఇక ఈ సినిమా తర్వాత నరేష్ హీరోగా నాంది సినిమాతో మంచి సక్సెస్ అయ్యారు.
ఈ సినిమా అనంతరం నరేష్ తాజాగా ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.ఈ సినిమా కూడా పరవాలేదు అనిపించుకుంది.
ఈ సినిమా తర్వాత నరేష్ తన తదుపరి సినిమాలతో కూడా బిజీగా ఉన్నారు.ఇదే కాకుండా ఈయన మరొక అగ్ర హీరోతో కలిసి ఓ సినిమాలో నటించబోతున్నారని సమాచారం.
ఈ క్రమంలోనే ఇండస్ట్రీలో రచయితగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ప్రసన్న కుమార్ మొదటిసారిగా మెగా ఫోన్ పట్టబోతున్నారు ఈయన దర్శకత్వంలో నాగార్జున ఓ సినిమా చేయబోతున్నట్టు సమాచారం.
ఈయన దర్శకత్వంలో నాగార్జున హీరోగా రాబోయే సినిమాలో ఓ కీలక పాత్రలో నరేష్ నటించడానికి నాగార్జున కూడా ఒప్పుకున్నారని అదేవిధంగా నరేష్ పాత్ర కూడా నిడివి ఎక్కువగా ఉండటం చేత నరేష్ కూడా నాగార్జునతో కలిసినటించడానికి సిద్ధమైనట్లు సమాచారం.అయితే నాగార్జున ప్రసన్నకుమార్ సినిమా గురించి వస్తున్నటువంటి ఈ వార్తలలో ఎంతవరకు నిజము ఉందో తెలియాలంటే ఈ సినిమా గురించి అధికారక ప్రకటన వచ్చేవరకు వేచి చూడాలి.