NTR Lakshmi Pranathi: ఎన్టీఆర్ సినిమాలో లక్ష్మీ ప్రణతి.. డైరెక్టర్ పై ఫైర్ అయిన తారక్?

తెలుగు సినీ ఇండస్ట్రీలో నందమూరి వారసుడిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుని హీరోగా మంచి సక్సెస్ అందుకున్నటువంటి ఎన్టీఆర్ (NTR) గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.

ఎన్టీఆర్ ప్రస్తుతం గ్లోబల్ స్టార్ ఇమేజ్ సొంతం చేసుకుని వరుస పాన్ ఇండియా సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు.

ప్రస్తుతం కొరటాల శివ(Kortala Shiva) దర్శకత్వంలో దేవర (Devara) అనే సినిమా షూటింగ్ పనులలో ఎన్టీఆర్ ఎంతో బిజీగా గడుపుతున్నారు.ఈయన తదుపరి సినిమా డైరెక్టర్ ప్రశాంత్ నీల్(Prashanth Neel) డైరెక్షన్లో రాబోతుంది అలాగే బాలీవుడ్ వార్ 2(War 2)సినిమాలో కూడా ఎన్టీఆర్ నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే.

ఇలా కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నటువంటి ఎన్టీఆర్ తన వ్యక్తిగత జీవితంలో కూడా తన భార్య పిల్లలతో కలిసి చాలా సంతోషంగా ఉన్న సంగతి మనకు తెలిసిందే.ఈయన లక్ష్మీ ప్రణతి(Lakshmi Pranathi) అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు.

ఈ దంపతులకు ఇద్దరు కూడా కుమారులు అనే విషయం మనకు తెలిసిందే.ఇక లక్ష్మీ ప్రణతి అందరి హీరోల భార్యల కంటే ఈమె చాలా డిఫరెంట్ అని చెప్పాలి ఈమె ఒక సాధారణ గృహిణిగా ఇంటిపట్టునే ఉంటూ తన పిల్లల బాధ్యతలను తన అత్తయ్య ఇంటి బాధ్యతలను చూసుకుంటూ బిజీగా ఉన్నారు.

Advertisement

ఇక ఈమె సోషల్ మీడియాకి కూడా చాలా దూరంగా ఉంటారు అనే సంగతి అందరికీ తెలిసిందే.

ఇలా స్టార్ హీరో భార్య అనే విషయాన్ని పూర్తిగా మర్చిపోయిన లక్ష్మీ ప్రణతి ఒక సాధారణ అమ్మాయి లాగే జీవితం గడపడానికి ఇష్టపడుతుంటారు.ఇక ఈమె ఏదైనా ఫంక్షన్లలోనూ లేదా కుటుంబ సభ్యులకు సంబంధించిన వేడుకలలో మాత్రమే బయట కనపడుతూ ఉంటారు.ఇక ఈమె స్టార్ హీరోని పెళ్లి చేసుకున్నప్పటికీ సినిమాలంటే కూడా పెద్దగా ఏమాత్రం ఆసక్తి లేదని అర్థమవుతుంది.

ఇలా సినిమాలంటేనే ఇంట్రెస్ట్ లేనటువంటి లక్ష్మీ ప్రణతిని సినిమాలలో నటించాలి అంటూ ఒక డైరెక్టర్ ప్రపోజల్ తీసుకువెళ్లారట.అయితే ఎన్టీఆర్ సినిమాలోని తనకు అవకాశం కల్పించారని తెలుస్తుంది.

ఎన్టీఆర్ సినిమాలు కేవలం ఎలాంటి డైలాగ్స్ లేకుండా ఆయన పక్కన నిలబడే చిన్న గెస్ట్ పాత్రలో( Guest Role ) నటించాలి అంటూ డైరెక్టర్ అవకాశాన్ని లక్ష్మీ ప్రణతికి కల్పించడంతో లక్ష్మీ ప్రణతి అయ్యో నాకు నటన అంటే అసలు ఏ మాత్రం తెలియదు నాకు ఆసక్తి కూడా లేదు నేను నటించను అని చెప్పారట.అయినా వినకుండా ఆ డైరెక్టర్ నటించాలి అంటూ కాస్త బలవంతం చేయడంతో ఎన్టీఆర్ తీవ్రస్థాయిలో కోపం వ్యక్తం చేశారట.తనకు నటన అంటే ఇష్టం లేదని చెబుతోంది కదా తనని ఎందుకు బలవంతం చేయడం ఎందుకు అంటూ డైరెక్టర్ పై కాస్త సీరియస్ అయ్యారని తెలుస్తోంది.

ఆ ఒక్క సినిమా నా జీవితాన్నే మార్చేసింది... రష్మిక ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
రవితేజ కి రెమ్యూనరేషన్ ఎక్కువగా ఇస్తే కథ కూడా వినకుండా సినిమా చేసేస్తాడా..?

ఇలా సినిమాలంటేనే ఇష్టం లేనటువంటి లక్ష్మీ ప్రణతి వద్దకు వెళ్లి సినిమాలలో నటించమని చెప్పిన ఆ డైరెక్టర్ ఎవరు అనే విషయానికి వస్తే ఆయన మరెవరో కాదు ఎన్టీఆర్ స్నేహితుడు ప్రశాంత్ నీల్. ఎన్టీఆర్ ప్రశాంత్ ఇద్దరు కూడా ఎంత మంచి స్నేహితులు మనకు తెలిసిందే.ఈ క్రమంలోనే ఎన్టీఆర్ నటించే సినిమాలో లక్ష్మీ ప్రణతికి కూడా అవకాశం కల్పించాలని భావించారట.

Advertisement

అయితే ఇష్టం లేనటువంటి ఎన్టీఆర్ లక్ష్మీ ప్రణతి ఇద్దరు కూడా రిజెక్ట్ చేశారని ఇక అయినప్పటికీ ప్రశాంత్ బలవంతం చేయడంతో ఎన్టీఆర్ కాస్త గట్టిగానే సమాధానం చెప్పారంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వైరల్ అవుతున్నాయి.మరి ఎన్టీఆర్ భార్య ప్రణతి గురించి వస్తున్నటువంటి ఈ వార్తలలో ఎంతవరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది.

తాజా వార్తలు