ఎన్టీఆర్ ఎమోషనల్ పోస్ట్.. ఎప్పటికి ధ్రువ తార మీరే అంటూ..

సీనియర్ ఎన్టీఆర్ 26వ వర్ధంతి సందర్భంగా నందమూరి తారక రామారావు అభిమానులతో పాటు కుటుంబ సభ్యులు కూడా ఆయనకు నివాళులు అర్పిస్తున్నారు.

ఈయన తెలుగు సినీ పరిశ్రమకే ఒక వెలుగు తెచ్చాడన్న విషయం అందరికి విదితమే.

తెలుగు ఖ్యాతిని పెంచే విధంగా ఆయన చేసిన పనులన్నీ ఇప్పటికి కూడా ప్రేక్షకుల మదిలో నిలిచి పోయాయి.అందుకే ఆయన లేక ఇన్ని సంవత్సరాలు అవుతున్నా నేటికీ తెలుగు సినిమా ప్రస్తావన వస్తే మాత్రం మొట్ట మొదటిగా అందరు శ్రీ స్వర్గీయ నందమూరి తారక రామారావు గురించే మాట్లాడు కుంటారు.

ఆయన పేరునే ప్రతి ఒక్కరు తలచు కుంటారు.మరి ఆయన పోలికలను పుణికి పుచ్చుకుని మరలా ఆయనే జన్మించారా అనేలా ఆయన మనవడు జూనియర్ తారక రామారావు ఉంటాడు.

ఈయన కూడా తాతలాగానే తెలుగు సినిమా ఇండస్ట్రీలో పెద్ద స్టార్ గా ఎదిగి తనకంటూ ప్రత్యేకమైన ఫాలోయింగ్ కూడా సంపాదించు కున్నాడు.

Advertisement

అలాగే ఎన్టీఆర్ కు కూడా తాత మీద ఉన్న ప్రేమ అమితమైనది.ఈ విషయం ఎన్నో సార్లు ఆయన మాటల్లోనే విన్నాం.ఆయన తాతయ్య పట్ల ఉన్న ప్రేమను, గౌరవాన్ని చాలా సందర్భాల్లో బయటకు చెప్పాడు.

అలాగే ఈ రోజు సీనియర్ ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఆయన మనవడు జూనియర్ ఎన్టీఆర్ కూడా ఆయనను గుర్తు చేసుకుంటూ తన తాతయ్య పై ఉన్న ప్రేమను తెలుపుతూ సోషల్ మీడియాలో భావోద్వేగమైన పోస్ట్ చేసాడు.తెలుగు ప్రజల గుండెల్లో నాటికీ.నేటికీ.

ముమ్మాటికీ.ధ్రువ తార మీరే అంటూ ఎన్టీఆర్ చేసిన ఈ పోస్ట్ ఇప్పుడు నందమూరి అభిమానులను మరింత ఎమోషనల్ అయ్యేలా చేస్తుంది.

పుట్టినరోజున అరుదైన ఘనతను సొంతం చేసుకున్న సింగర్ సునీత.. ఏం జరిగిందంటే?
Advertisement

తాజా వార్తలు