Journalist imandi ramarao hyper adi: హైపర్ ఆది పంచ్ లు వింటే అసహ్యమేస్తోంది.. జర్నలిస్ట్ షాకింగ్ కామెంట్స్!

బుల్లితెర టాప్ కమెడియన్లలో ఒకరైన హైపర్ ఆదిపై ప్రేక్షకుల్లో మంచి అభిప్రాయం ఉన్నా హైపర్ ఆది పంచ్ లపై ప్రేక్షకుల్లో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి.

ప్రముఖ జర్నలిస్ట్ లలో ఒకరైన ఇమంది రామారావు హైపర్ ఆది గురించి షాకింగ్ కామెంట్లు చేయగా ఆ కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇమంది రామారావు మాట్లాడుతూ రేటింగ్ ను బట్టి మార్కెటింగ్ ఉంటుందని ఆయన అన్నారు.జబర్దస్త్ షోలో ఇచ్చేపేమెంట్స్ కూడా మంచి పేమెంట్స్ అని ఇమంది రామారావు అన్నారు.

జబర్దస్త్ షోలో ఒక్కో టీమ్ కు 5 లక్షల రూపాయల చొప్పున పారితోషికం అందిందని రామారావు తెలిపారు.జబర్దస్త్ లోని ఎంతోమంది ఆర్టిస్ట్ లకు ఈ షో ద్వారా లైఫ్ వచ్చిందని ఆయన కామెంట్లు చేశారు.

రష్మీ తెలుగు రాకపోయినా నేర్చుకుని మంచి పేరు తెచ్చుకుందని ఆయన వెల్లడించడం గమనార్హం.జబర్దస్త్ వేదికను తక్కువగా చూస్తే ఇబ్బంది పడాల్సిందేనని ఆయన చెప్పుకొచ్చారు.

Advertisement

జబర్దస్త్ ను చూసి ఇతర కామెడీ ప్రోగ్రామ్స్ పెట్టినా ఆ షోలు సక్సెస్ కాలేదని ఆయన పేర్కొన్నారు.రోజాకు అవకాశం లేక ఇంద్రజ వచ్చిందని ఆయన అన్నారు.జబర్దస్త్ షోకు కృష్ణ భగవాన్ జడ్జిగా కరెక్ట్ అని ఆయన తెలిపారు.

హైపర్ ఆది వేసే పంచ్ లను చూస్తే అసహ్యం వేస్తుందని రామారావు చెప్పుకొచ్చారు.

వెటకారం, వ్యంగ్యం అవతలి వాళ్లను కించపరిచేలా ఉండకూడదని ఆదికి రామారావు అన్నారు.కామెడీ అనేది భళ్లాలతో గుచ్చినట్టు ఉండకూడదని ఆయన పేర్కొన్నారు.జబర్దస్త్ డైరెక్టర్లు ఈ విషయంలో జాగ్రత్త పడాలని ఆయన వెల్లడించారు.

సుధీర్ కు సెల్ఫ్ ప్రమోషన్స్ ఎక్కువగా ఉన్నాయని సుధీర్ వ్యక్తిగతంగా చాలా మంచి వ్యక్తి అని ఆయన పేర్కొన్నారు.ఇమంది రామారావు వెల్లడించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

రైతు పండుగ :నేడు రేవంత్ చెప్పనున్న ఆ రెండు శుభవార్తలు ఏంటి ? 
Advertisement

తాజా వార్తలు