నన్ను దారుణంగా హింసించింది.. మాజీ భార్యపై హీరో రూ. 380 కోట్ల పరువు నష్టం దావా!

సాధారణంగా భార్య భర్తల మధ్య గొడవలు సహజంగానే వస్తూ ఉంటాయి.

ఈ క్రమంలోనే కొన్ని కొన్ని సార్లు ఆ గొడవలు చిన్న చిన్న మాటలతో ముగిసిపోగా, ఇంకొన్ని గొడవలు మాత్రం చిలికి చిలికి గాలి వానలా మారుతూంటాయి.

కొన్ని కొన్ని సార్లు అయితే ఆ గొడవలు విడాకులు తీసుకోవడం లేదంటే ఒకరిపై ఒకరు దాడులు చేసుకోవడం వరకూ వెళుతూ ఉంటాయి.అయితే కేవలం సాధారణ వ్యక్తుల మధ్యనే కాకుండా పెద్ద పెద్ద సెలబ్రిటీల మధ్య గొడవలు జరుగుతూ ఉంటాయి.

ఇక పెద్ద పెద్ద సెలబ్రిటీలు అయితే వారి వైవాహిక జీవితంలో కలతలు రాగానే వెంటనే విడాకులు తీసుకొని వెళ్ళి పోతూ ఉంటారు.ఇప్పటికే అలా ఎంతో మంది విడాకులు తీసుకొని విడిపోయిన విషయం తెలిసిందే.

అలాంటి వారిలో హీరో జానీ డేప్ కూడా ఒకరు.హీరో జానీ అతని భార్య పై ఏకంగా 380 కోట్లు పరువు నష్టం దావా వేశాడు.

Advertisement

అసలేం జరిగిందంటే.హీరో జానీ, నటి అంబర్ హెర్డ్ దాదాపుగా మూడేళ్లపాటు డేటింగ్ చేస్తూ ప్రేమలో మునిగితేలారు.

ఆ తరువాత 2017 లో అంబర్ హెర్డ్ ను హీరో జానీ రెండవ వివాహం చేసుకున్నాడు.అయితే పెళ్లి అయిన తర్వాత కొన్నాళ్లకే వీరి మధ్య చిన్న చిన్న మనస్పర్ధలు కలతలు రావడంతో పెళ్లయిన రెండేళ్ల తర్వాత 2017లో విడిపోయారు.

ఆ తర్వాత అంబర్ హెర్డ్ తాను ఒక గృహహింస బాధితురాలిని అంటూ రాసిన వ్యాసంపై హీరో జానీ ఏకంగా 380 కోట్ల పరువు నష్టం దావా వేశాడు.తాను అంబర్ ను ఏ విధంగా ఏ రకంగా హింసించ లేదు అని జానీ తెలిపాడు.పెళ్లయిన ఏడాది తర్వాత నుంచి వారి మధ్య తరచూ గొడవలు జరుగుతూ ఉండేవని, అప్పటి నుంచి ఆమె నన్ను దౌర్జన్యంగా, హింసాత్మకంగా మాటల్లో చెప్పలేని తిట్లతో అవమానించేది అని చెప్పుకొచ్చాడు జానీ.

ఇంట్లో వస్తువులు అయినా టీవీ రిమోట్, వైన్ గ్లాస్ తలపై విసిరేది అని, అంతేకాకుండా మానవ మలం బెడ్ పై ఉంచేది అనీ వర్జీనియా కోర్టులో వాపోయాడు హీరో జానీ.ఇకపోతే ప్రస్తుతం వర్జీనియాలో జరుగుతున్న ఈ పరువు నష్టం దావా కేసు ఇప్పుడు రెండో వారానికి చేరుకుంది.

మోయే మోయే మూమెంట్స్ ఫేస్ చేసిన టాప్-3 సినిమా సెలబ్రిటీస్
ఇండస్ట్రీలో అడుగు పెట్టిన 17 ఏండ్లకు తొలిసారి డబ్బింగ్ చెప్పిన విజయశాంతి..

ఇక ఈ కేసులో తర్వాత సాక్షులుగా పారిశ్రామికవేత్త అయిన ఎలాన్ మస్క్, నటులుజేమ్స్ ఫ్రాంకో, పాల్ బెటనీ లు హాజరుకానున్నారు.మరి ఈ కేసు లో ఎవరు గెలుస్తారు.

Advertisement

కోర్టు ఎవరికీ అనుగుణంగా తీర్పును ఇస్తుందో చూడాలి మరి.

తాజా వార్తలు