బిడెన్ అలా...ఆంటోని ఫౌచీ ఇలా...అసలు నిజమేంటి...??

కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను ఓ కుదుపు కుదిపేసింది.

మొదటి వేవ్ లో అగ్ర రాజ్యం అమెరకా అల్లాడి పొతే సెకండ్ వేవ్ లో తమపై ఎలాంటి ప్రభావం లేదని, భవిష్యత్తు లో కూడా అమెరికా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని, అమెరికా ప్రజలు అందరూ వ్యాక్సినేషన్ లో భాగస్వాములు అయ్యారని, బిడెన్ జబ్బలు చరుచుకున్నారు.

కేవలం కొందరు తప్ప అమెరికాలో వ్యాక్సినేషన్ విజయవంతంగా పూర్తయ్యిందని ప్రకటించుకున్నారు.మహమ్మారి పై పూర్తిగా విజయం సాధించామని, త్వరలో పూర్వపు స్థితికి అమెరికన్స్ అందరూ చేరుకుంటారని అన్నారు.

జులై 4వ తేదీన అమెరికా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలలో భాగంగా జాతిని ఉద్దేశించి ప్రసంగించిన బిడెన్ బ్రిటీష్ పరిపాల నుంచీ బయటపడేందుకు మనం ఎలాగైతే కష్టపడ్డామో ప్రస్తుతం మహమ్మారి నుంచీ బయటపడటానికి అలాంటి ఎంతో కృషి చేశామని, ప్రస్తుతం విజయం అంచున ఉన్నామని ప్రకటించారు.భవిష్యత్తు లో వచ్చే వైరస్ లతో మనకు ఇబ్బంది లేదు, వ్యాక్సినేషన్ మనం విజయవంతంగా పూర్తి చేసుకున్నామని ప్రకటించుకున్నారు.

బిడెన్ చెప్పిన మాటలు అమెరికన్స్ లో ధైర్యాన్ని నింపగా, అమెరికా అంటువ్యాధుల నిపుణుడు, అధ్యక్షుడు వైద్య సలహాదారు ఆంటోని ఫౌచీ సంచలన వ్యాఖ్యలు చేశారు.అమెరికాలో కోవిడ్ కారణంగా మరణిస్తున్న వారి సంఖ్య పెరుగుతోందని, ఈ ప్రభావం మరింతగా ముదిరే అవకాశం ఉందని, ప్రజలు తప్పనిసరిగా మాస్క్ ధరించుకోవాలని సూచించారు.అంతేకాదు మహమ్మారి కారణంగా ప్రాణాలు కోల్పోతున్న వారిలో వ్యాక్సినేషన్ తీసుకోని వారే అత్యధికంగా ఉంటున్నారని చనిపోయిన వారిలో 99 శాతం మంది వ్యాక్సిన్ తీసుకోని వారు ఉన్నారని అన్నారు.

Advertisement

అయితే ఇక్కడ బిడెన్ వ్యాఖ్యలకు, ఆంటోని ఫౌచీ వ్యాఖ్యలకు సంభంధం లేకుండా పోయింది ఒక పక్క బిడెన్ అమెరికా సేచ్చా వాయువులు పీల్చుకునే రోజు వచ్చిందని అంటుంటే, మరో పక్క ఫౌచీ ప్రజలు జాగ్రత్తగా ఉండాలనిమృతుల సంఖ్య పెరుగుతోందని చెప్పడం అమెరికన్స్ ను డైలమాలో పడేసింది.

తల్లికి 15 లక్షల విలువ చేసే జ్యూవెలరీ ఇచ్చిన పల్లవి ప్రశాంత్.. ఈ కొడుకు గ్రేట్ అంటూ?
Advertisement

తాజా వార్తలు