జబర్దస్త్ వల్గర్ కామెడీ తన వల్ల కాదు అన్న జయసుధ  

జబర్దస్త్ షో కి జడ్జ్ గా చేయనన్న జయసుధ. .

Jayasudha Not Interested To Act As A Judge For Jabardasth Show-jaya Sudha,not Interested To Act As A Judge,tollywood

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకప్పటి హీరోయిన్, ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న నటి జయసుధ. అయితే జయసుధ ఇప్పటి వరకు రియాలిటీ షోలకి జడ్జ్ గా వ్యవహరించిన సందర్భం లేదు. అయితే తాజాగా ఆమెని జబర్దస్త్ షో లో జడ్జ్ గా ఉండాలని ఆఫర్ వెళ్ళినట్లు తెలుస్తుంది..

జబర్దస్త్ వల్గర్ కామెడీ తన వల్ల కాదు అన్న జయసుధ-Jayasudha Not Interested To Act As A Judge For Jabardasth Show

దీనికి ఆమె సున్నితంగా తిరష్కరించారని సమాచారం.జబర్దస్త్ కామెడీ షోకి మొన్నటి వరకు జడ్జ్ లుగా నాగాబాబు, రోజా ఉన్నారు. అయితే వాళ్ళిద్దరూ ఇప్పుడు పొలిటికల్ గా బిజీ కావడంతో వారి ప్లేస్ లో చాలా మందిని సంప్రదించిన నిర్వాహకులు జయసుధని కూడా అడిగినట్లు తెలుస్తుంది.

అయితే అలాంటి వల్గర్ కామెడీకి జడ్జ్ గా ఉండలేనని చెప్పినట్లు సమాచారం. దీంతో ఫైనల్ గా ఆ షో కోసం మీనా, శేఖర్ మాస్టర్ ని తీసుకోవడం జరిగింది అని తెలుస్తుంది.