అది కళాత్మక స్వేచ్ఛ..రణవీర్ న్యూడ్ ఫోటోలపై జాన్వీ షాకింగ్ కామెంట్స్?

బాలీవుడ్ నటుడు రణవీర్ సింగ్ ప్రముఖ మ్యాగజైన్ కోసం న్యూడ్ ఫోటోషూట్ జరుపుకున్న విషయం మనకు తెలిసిందే.

అయితే ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పెద్ద ఎత్తున వివాదం చెలరేగింది.నటుడు రణవీర్ మహిళల మనోభావాలను దెబ్బతీసేలా ఫోటోషూట్ చేయించుకున్నారని ఏకంగా ఈయనపై కేసులు కూడా పెట్టారు.ఇలా ఈయన ఈ ఫోటో షూట్ లపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్న నేపథ్యంలో మరికొందరు ఈయనకు మద్దతు తెలియజేస్తున్నారు.

ఇప్పటికే కాశ్మీర్ ఫైల్స్ డైరెక్టర్ రణవీర్ కి మద్దతు తెలుపగా అలియాభట్,ప్రముఖ సంచలనాత్మక డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ వంటి వారు సైతం అతని గురించి ఏ విధమైనటువంటి కామెంట్స్ చేయకూడదనీ, ఇలాంటి న్యూడ్ ఫోటోషూట్ చేయాలంటే ఎంతో ధైర్యం ఉండాలని వర్మ తనకు మద్దతు ప్రకటించారు.ఇకపోతే తాజాగా ఓ మీడియా సమావేశంలో పాల్గొన్న నటి జాన్వీ కపూర్ కు రణవీర్ న్యూడ్ ఫోటోల గురించి ప్రశ్నలు ఎదురయ్యాయి.

ఈ సందర్భంగా ఈమె రణవీర్ న్యూడ్ ఫోటోలపై స్పందిస్తూ చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

Janvi Shocking Comments On Ranveer Singh Photoshoot Ranveer Singh, Bollywood, Ra

ఈ సందర్భంగా జాన్వీ కపూర్ మాట్లాడుతూ.ఇది ఒక కళాత్మక స్వేచ్ఛ అని నేను భావిస్తున్నాను.అందుకు అతడిని శిక్షించకూడదని ఈ సందర్భంగా ఈమె కూడా రణవీర్ కి మద్దతు ప్రకటించారు.

Janvi Shocking Comments On Ranveer Singh Photoshoot Ranveer Singh, Bollywood, Ra

ఈ విధంగా రణవీర్ న్యూడ్ ఫోటో గురించి జాన్వీ కపూర్ చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.ఇకపోతే గత కొద్ది రోజుల క్రితం విజయ్ దేవరకొండ న్యూడ్ ఫోటో పై కూడా జాన్వి కపూర్ స్పందించిన విషయం మనకు తెలిసిందే.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - ఆగష్టు 16, సోమవారం, 2021

తాజా వార్తలు