జనతా గ్యారేజ్ ఇంటర్వల్ బ్యాంగ్ లీక్ అయ్యింది

జనతా గ్యారేజ్ ఈ ఏడాది మహేశ్ , పవన్ సినిమాలు పూర్తి అవ్వడం తో ట్రేడ్ వర్గాలతో పాటు ప్రతీ సామాన్య ప్రేక్షకుడూ ఈ సినిమా వైపే చూస్తున్నాడు.

పైగా శ్రీమంతుడు లాంటి బ్లాక్ బస్టర్ తరవాత కొరటాల శివ కీ , నాన్నకు ప్రేమతో లాంటి హిట్ సినిమా తరవాత ఎన్టీఆర్ కీ ఇది కీలకమైన సినిమాగా మారడం తో ఈ సినిమా విశేషాల గురించి తెలుస్కోవడానికి అందరూ ఉత్సాహ పడుతున్నారు.

అయితే మన వెబ్సైటు కి అందుతున్న విశ్వసనీయ సమాచారం ప్రకారం కొరటాల శివ ఇంటర్వెల్ బ్యాంగ్ ని చాలా ఆసక్తికరంగా మలచాడు అంటున్నారు.కొరటాల శివ ఇప్పటికే మిర్చి, శ్రీమంతుడు రెండు ఇంటర్వెల్ బ్యాంగ్ లనీ చాలా హై లైట్ గా చూపించినట్టే ఇందులో కూడా భారీ ఫైట్ తో కూడిన ట్విస్ట్ ఉంటుంది అని తెలుస్తోంది.

మొదటి భాగం మొత్తం సమంత - ఎన్టీఆర్ లో రోమాన్స్ సాగగా సెకండ్ హాఫ్ లో సినిమా లో రెండవ హీరోయిన్ అయిన నిత్యా మీనన్ తో పాటు మోహన్ లాల్ కూడా ఎంటర్ అయ్యి భారీ ట్విస్ట్ ఇస్తారట.అప్పుడు జరిగే ఫైట్ తో సినిమా అద్భుతంగా నడుస్తుంది అంటున్నారు.

Pokiri : పోకిరి సినిమా ఎందుకు ఆడిందో ఇప్పటికీ నాకు అర్థం కావడం లేదు
Advertisement

తాజా వార్తలు