బీజేపీ తో పొత్తు భారమేనా ? పవన్ దూరమేనా ?

అధినేత పవన్ కళ్యాణ్ ఆలోచన మారుతునట్టు కనిపిస్తోంది.  ఏపీలో బీజేపీ, జనసేన పార్టీలు పొత్తు కొనసాగుతున్న, ఎవరికి వారు విడివిడిగా కార్యక్రమాలు చేపడుతున్నారు.

అసలు ఏమాత్రం రెండు పార్టీలకు మధ్య సంబంధం లేదన్నట్లుగా వ్యవహారాలు చోటుచేసుకుంటున్నాయి.జనసేన ను పట్టించుకోనట్టుగా బిజెపి వ్యవహరిస్తుండగా,  బీజేపీతో  అదేవిధంగా జనసేన  వ్యవహారాలు చేస్తోంది.

  దీంతో 2024 ఎన్నికల లోపు రెండు పార్టీల మధ్య పొత్తు తెగతెంపులు అవుతాయనే అభిప్రాయాలు రాజకీయ వర్గాల్లో నెలకొన్నాయి.  దీనికి తగ్గట్లుగానే గత కొంతకాలంగా కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా పోరాటాలు చేపడుతున్నారు.

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంతో పాటు,  ఇంకా అనేక విషయాలపై నిరసనలు తెలుపుతున్నారు.      నేరుగా బిజెపిపై విమర్శలు చేయకపోయినా,  పరోక్షంగా బిజెపి ని ఇబ్బంది పెట్టే విధంగా వ్యవహరిస్తున్నారు.

Advertisement

ఇక ప్రస్తుతం తెలంగాణలో అధికార పార్టీ టిఆర్ఎస్ తో సన్నిహితంగా మెలుగుతున్నారు.భీమ్ల నాయక్ సినిమా విడుదల సందర్భంగా మంత్రి కేటీఆర్ పవన్ కు శుభాకాంక్షలు తెలిపారు.

అలాగే ఫ్రీ రిలీజ్ ఫంక్షన్ కు హాజరయ్యారు.రాబోయే ఎన్నికల నాటికి జనసేన సహకారం కూడా టిఆర్ఎస్ కు ఉండేలా.

  బీజేపీకి పవన్ ను దూరం చేసే విధంగా టిఆర్ఎస్ వ్యూహాలు పన్నుతోంది.ఏపీలో టీడీపీ జనసేన పొత్తు పెట్టుకునే అవకాశాలు ఉన్నట్లు గా కనిపిస్తోంది.

ప్రస్తుతం వ్యవహారం చూస్తుంటే , జనసేన బీజేపీ పొత్తు పెట్టుకునేందుకు మరెంతోకాలం లేదన్నట్లుగా వ్యవహారం కనిపిస్తోంది.   

టీడీపీ అధినేత చంద్రబాబుకు ఈసీ హెచ్చరిక..!!
10 గంటల పాటు డంప్ యార్డ్ లో ధనుష్.. ఈ నటుడి కష్టానికి ఫిదా అవ్వాల్సిందే!

  అలాగే నరసాపురం పార్లమెంట్ ఉప ఎన్నిక వస్తుందని పవన్ నమ్ముతున్నారు.నరసాపురం నుంచి వైసీపీ ఎంపీ గా ఉన్న రఘురామకృష్ణంరాజు తన పదవికి రాజీనామా చేసి బిజెపి నుంచి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తారని పవన్ అంచనా వేస్తున్నారు.అదే జరిగితే తన సోదరుడు నాగబాబు ను జనసేన అభ్యర్థిగా నిలబెట్టాలని పవన్ వ్యూహంగా తెలుస్తోంది.

Advertisement

ఆ ఆలోచనతోనే పవన్ నరసాపురంలో మత్స్యకార సభను  నిర్వహించినట్లు గా ప్రచారం జరుగుతోంది.ప్రస్తుతం బిజెపితో పొత్తు కొనసాగుతున్న అది ఎన్నికల నాటికి తమకు భారం తప్ప, పెద్దగా ప్రయోజనం ఉండదనే లెక్కల్లో పవన్ ఉన్నారట.

అందుకే మెల్లిమెల్లిగా బీజేపీకి దూరం అయ్యే విధంగా పవన్ ఎత్తుగడలు వేస్తున్నట్టు సమాచారం.

" autoplay>

తాజా వార్తలు