వారాహి@4 ఫోర్ - కొత్త సీన్ కనపడబోతుందా ?

ఇప్పటికే మూడు విడుతల వారాహి విజయయాత్రతో( Varahi Vijaya Yatra ) తాను అనుకున్న రాజకీయ మైలేజ్ సాధించిన పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) చాలా గ్యాప్ తర్వాత నాలుగో విడత యాత్రకు శ్రీకారం చుట్టారు.

అక్టోబర్ ఒకటో తారీకు నుంచి కృష్ణాజిల్లా వేదికగా వారాహి విజయ యాత్ర 5వ తేదీ వరకు కొనసాగుతుందని ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల చైర్మెన్ నాదెండ్ల మనోహర్( Nadendla Manohar ) వెల్లడించారు.

అయితే మూడు విడతల వారాహి యాత్రకు భిన్నంగా నాలుగో విడత యాత్ర జరగబోతుందంటూ జనసేన శ్రేణులు చెప్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి .మూడో విడతకు నాలుగో విడతకు మధ్య అనేక కీలక రాజకీయ పరిణామాలు ఆంధ్రప్రదేశ్లో జరిగినందున వాటి ప్రభావం ఈ యాత్రపై ఉంటుందని తెలుస్తుంది.

ప్రతిపక్ష నేత చంద్రబాబు అరెస్టు తదనంతర పరిణామాలు, రాజమండ్రి సెంట్రల్ జైల్లో చంద్రబాబును( Chandrababu Naidu ) పవన్ కలవడం, పొత్తు ప్రకటించడం, ఉమ్మడి కార్యాచరణ రూపొందించుకోవడం కోసం కమిటీలను ఏర్పాటు చేసుకోవడం ఇలా పరిణామాలు శరవేగం గా ముందుకు కదిలాయి.దాంతో వారాహి నాలుగో విడత మరింత హాట్ గా ఉండబోతుందని , రెట్టించిన పట్టుదలతో జనసైనికులతో పాటు పసుపు సైన్యం కూడా కలిసి కథం తొక్కుతుందని, ప్రభుత్వంపై నిరసన జెండా ఎగరవేయబోతున్నారంటూ వార్తలు వస్తున్నాయి.

కృష్ణాజిల్లాలో( Krishna District ) జనసేనతో పాటు తెలుగుదేశానికి కూడా గట్టి పట్టు ఉండటం, కీలక నాయకులు పార్టీకి అండగా ఉండడంతో వారందరూ ఇప్పుడు జనసేనకు అండగా నిలబడబోతున్నారని భారీ జన సమీకరణ చేసి ప్రభుత్వంపై నిరసన తెలియజేయడం కోసం ఉమ్మడి కార్యాచరణ చేయబోతున్నారని ఇరు పార్టీల కార్యకర్తలు కలిస్తే ఏ స్థాయి ప్రజాబలం ఉంటుందో అధికార పార్టీకి చూపించబోతున్నారంటూ వార్తలు వస్తున్నాయి .ఇకపై పరిస్థితి ఇంతకు ముందులా ఉండదని పూర్తిస్థాయి ఎన్నికల వాతావరణాన్ని ఇకపై ఆంధ్ర లో చూడబోతున్నట్లుగా రాజకీయ పరిశీలకు అంచనా వేస్తున్నారు.

Advertisement
బీట్‌రూట్ ఆకుల‌తో ఇలా చేస్తే.. ఊడిన జుట్టు మ‌ళ్లీ వ‌స్తుంది!

తాజా వార్తలు