ఎన్నికల ఏర్పాట్లు మొదలు పెట్టేసిన జగన్ ?

ఎన్నికల యుద్దానికి చివరి అంకానికి చేరుకున్నందున పార్టీ శ్రేణులను ఎన్నికల వైపుగా ముఖ్యమంత్రి జగన్ సిద్దం చేస్తున్నట్టుగా తెలుస్తుంది.పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నియోజకవర్గాల కన్వీనర్లు, ఇన్చార్జిలతో జగన్( YS Jagan Mohan Reddy ) సుదీర్ఘ సమావేశం అయ్యారు.

 Jagan Who Started The Election Preparations, Ys Jagan Mohan Reddy, Chandrababu A-TeluguStop.com

ఎన్నికలలో లో అనుసరించాల్సిన వ్యూహాలు మరియు ప్రభుత్వ ప్రతిష్టాత్మక కార్యక్రమం అయిన గడప గడపకు ప్రోగ్రాం తాలూకు ఫలితాలను జగన్ వీరితో పంచుకున్నట్లుగా తెలుస్తుంది .అంతేకాకుండా చంద్రబాబు అరెస్టు తర్వాత రాష్ట్రంలో ఏర్పడిన పరిస్థితులను ముఖ్యంగా తెలుగుదేశం ఆరోపణలు ప్రజల పై ఏమైనా ప్రభావం చూపుతున్నాయా , వాటిని ఏ విధంగా ఎదుర్కోవాలన్న విషయాలపై జగన్ పార్టీ( Jana sena ) నేతలకు దిశా నిర్దేశం చేస్తున్నట్లుగా తెలుస్తుంది.అంతేకాకుండా పొత్తు వల్ల ఏర్పడబోయే పరిస్థితులను ఎదుర్కోవడానికి బలహీనంగా ఉన్న నియోజకవర్గాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అక్కడ అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేయాలని జగన్ పార్టీ నేతలకు సూచించినట్లుగా తెలుస్తుంది.

Telugu Amaravati, Ap, Chandrababu, Jana Sena, Ysjagan-Telugu Political News

అంతేకాకుండా చంద్రబాబు అరెస్టు( Chandrababu arrest ) తరువాత తెలుగుదేశం పార్టీపై ఏమైనా సానుభూతి వచ్చిందా అన్న కోణంలో కూడా జగన్ ఆరా తీసినట్టు తెలుస్తుంది.తాను చేసిన తప్పులకే చంద్రబాబు జైలు పాలు అయ్యాడని, అంతేకాకుండా ప్రజాధనాన్ని అనేక కార్యక్రమాల ద్వారా లూటీ చేసిన విధానాన్ని ప్రజల్లో చర్చనీయాంశంగా మార్చాలని, అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ వంటి విషయాలలో కూడా చంద్రబాబు వారి అనునయులకు లాభం చేకూర్చే విధంగా రాష్ట్ర ఖజానాకు ఏ విధంగా నష్టం కలుగ చేశారో సాక్షాలతో సహా ప్రజల్లో వివరించాలని తద్వారా తెలుగుదేశం పై వ్యతిరేకత పెంచాలని సూచించినట్లుగా తెలుస్తుంది .

Telugu Amaravati, Ap, Chandrababu, Jana Sena, Ysjagan-Telugu Political News

ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని అలసత్వాన్ని సహించనని చిన్నస్థాయి వార్నింగ్ కూడా జగన్ ఇచ్చినట్టుగా ప్రచారం జరుగుతుంది.ప్రజాధరణ విషయంలో కాంప్రమైజ్ కాకూడదని, సంక్షేమ పథకాల విషయంలో కానీ అభివృద్ధి కార్యక్రమాలలో కానీ ఎటువంటి లోటు జరగకుండా ఈ ఆరు నెలల్లో జాగ్రత్తలు తీసుకోవాలని జగన్ సూచించారని తెలుస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube