ప్రస్తుతం ఏపీలో అసెంబ్లీ శీతాకాల సమావేశాలు జరుగుతున్నాయి.కానీ రాజకీయ పార్టీల మధ్య మాత్రం విమర్శల వేడి చాలా తీవ్ర స్థాయిలో రాజుకుంటోంది.
అసెంబ్లీ సమావేశాల్లో నాయకుల మధ్య జరుగుతున్న చర్చ అందరికి తెలిసిందే.ముఖ్యంగా ప్రతిపక్ష పార్టీలు, అధికార పార్టీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలపై విమర్శలు కూడా జోరుగా సోషల్ మీడియాలో ప్రచారం జోరందుకుంది.సన్నబియ్యం పంపిణీపై జగన్ గతంలో చేస్తున్న వ్యాఖ్యలను మంగళవారం అసెంబ్లీలో చేసిన కామెంట్స్‌ను జనసేన పార్టీ ట్వీట్ చేసింది.‘పేరు జగన్ ఇంటి పేరు యూటర్న్ ‘ అనే హెడ్డింగ్‌తో ఎన్నికలకు ముందు తాజాగా అసెంబ్లీలో సన్నబియ్యంపై చేసిన వ్యాఖ్యలను పోల్చుతూ జనసేన పార్టీ తమ ట్విట్టర్ ఖాతాలో ఓ వీడియో పోస్ట్ చేసింది.
సన్నబియ్యంపై అచ్చెన్నాయుడు సభలో విమర్శలు చేయగా ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని వాటిని తోసిపుచ్చారు.ఇంతలోనే సీఎం జగన్ స్పందిస్తూ అసలు సన్నబియ్యం అన్న పదమే మేము అనలేదని, ప్రజలను తినగలిగిన, నాణ్యమైన స్వర్ణతో పాటు, అలాంటి ఇతర రకాల బియ్యం సరఫరా చేస్తామని మాత్రమే తాను గతంలో చెప్పానని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు.
దీనికి సంబంధించి ఓ వీడియోను కూడా జగన్ సభలో ప్రసారం చేశారు.ప్రజలకు సన్నబియ్యం సరఫరాకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోందంటూ సాక్షి మీడియాలో తప్పుగా రాసారని .మీ విధంగానే వాళ్లూ తప్పుగా రాసారని జగన్ క్లారిటీ క్లారిటీ ఇచ్చారు.