ముఖ్యమంత్రి పుట్టినరోజు రోజు వేడుకల్లో జనసేన ఎమ్మెల్యే రాపాక

గత కొద్ది రోజులుగా గత కొద్ది రోజులుగా ఏపీలో జనసేన పార్టీ తరఫున గెలిచిన రాపాక వరప్రసాద్ వ్యవహార శైలి ఆ పార్టీకి కాస్త తలనొప్పిగా మారింది.

జనసేన పార్టీలో ఉంటూనే ఆ పార్టీ సిద్ధాంతాలకి విరుద్ధంగా సొంత అజెండాతో అధికార పార్టీని, ముఖ్యమంత్రి జగన్ ని పొగుడుతూ తన పంథాలో వెళ్తున్నారు.

మరోవైపు జనసేన పార్టీ నిర్మాణం, పవన్ వ్యవహారశైలిపై విమర్శలు చేస్తూ, జనసేన పార్టీలో ఉన్నాను అంటూ చెబుతున్నారు.అయితే ఎప్పటికప్పుడు అధికార పార్టీ పైనా తన ప్రేమను రాపాక చూపించుకుంటూ వస్తున్నారు.

ఇంగ్లీష్ మీడియం మొదటిసారిగా వైసీపీకి సపోర్ట్ గా మాట్లాడిన రాపాక తాజాగా ఏపీ 3 రాజధానిలో విషయంలో కూడా జనసేన పార్టీ అభిప్రాయానికి విరుద్ధంగా మాట్లాడారు.ఇదిలా ఉంటే తాజాగా ముఖ్యమంత్రి జగన్ పుట్టినరోజు సందర్భంగా నియోజకవర్గంలో నిర్వహించిన జరిగిన వేడుకల్లో రాపాక వరప్రసాద్ పాల్గొన్నారు.

అంతటితో ఆగకుండా నేరుగా జగన్ చిత్రపటానికి పాలాభిషేకం చేసి మరోసారి అధికార పార్టీ విధేయుడుని అని అందరికీ అర్థమయ్యేలా చేశారు.అయితే రాపాక వ్యక్తిగత ఎజెండాతో ఇలా వెళుతున్న జనసేన పార్టీ మాత్రం అతను వ్యవహారంపై అసలు స్పందించడం లేదు.

Advertisement

సోషల్ మీడియాలో కొన్ని ఫేక్ ప్రెస్ నోట్స్ రిలీజ్ అవుతున్న వాటిని జనసేన పార్టీ ఎప్పటికప్పుడు ఖండిస్తూనే ఉంది.అయితే రాపాక వరప్రసాద్ అధికార పార్టీకి సపోర్ట్ చేస్తున్నా జనసేన ఎందుకు అతనిపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు అనేది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా ఉంది.

మరోవైపు జనసేన పార్టీ సీరియస్ గా ముందుకు వెళుతుంటే రాపాక వరప్రసాద్ మాత్రం తనకేమీ పట్టనట్టు వ్యవహరించడం ఇప్పుడు మరింత ఆసక్తిగా మారింది.

Advertisement

తాజా వార్తలు