తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన జీవో 317 కు వ్యతిరేకంగా తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ జనజాగరణ దీక్ష చేపట్టిన విషయం తెలిసిందే.అయితే కోవిడ్ రూల్స్ కు వ్యతిరేకంగా వంద మందికి పైగా సమూహంగా జనాలు జమ అయి ఉంటే వెంటనే పోలీసులు చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన పరిస్థితుల్లో ఉద్రిక్తంగా మారిన విషయం తెలిసిందే.
అయితే ఈ సమయంలో బండి సంజయ్ మరియు కార్యకర్తలు గదిలో తలుపులు వేసుకొని పోలీసులకు సహకరించేది లేదని శాంతియుతంగా నిరసన తెలుపుతున్నామని బండి సంజయ్ పోలీసులకు తెలిపారు.
అయినా బండి సంజయ్ మరియు ఇతర బీజేపీ కార్యకర్తలు ఎంతకూ వినిపించక పోవడంతో పోలీసులు తలుపులు బద్దలు కొట్టి కార్యకర్తలను, బండి సంజయ్ ను అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేశారు.
అయితే బీజేపీ కార్యకర్తలు ఎంతకూ వినిపించకపోకపోవడంతో జరిగిన ఉద్రిక్తతలో బండి సంజయ్ పై బీజేపీ కార్యకర్తలపై టియర్ గ్యాస్ ప్రయోగించారు.దీంతో రూమ్ అంతా పొగతో నిండి పోవడంతో ఇక అదే సమయంలో బండి సంజయ్ ను బలవంతంగా అదుపులోకి తీసుకున్న పరిస్థితి ఉంది.
ఇక బండి సంజయ్ ను అదుపులోకి తీసుకోవడంతో ఒక్కసారిగా దీక్షా ప్రాంగణమంతా ఉద్రిక్తంగా మారింది.

అయితే పోలీస్ స్టేషన్ కు బండి సంజయ్ ను తరలించినా అక్కడ కూడా దీక్ష కొనసాగించారు.అయితే ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ పార్టీ నేతలు జనజాగరణ దీక్ష ఘటనపై నిరసన తెలియజేస్తున్న పరిస్థితి ఉంది.అయితే కోవిడ్ రూల్స్ కు అనుగుణంగా మాత్రమే మేము చర్యలు తీసుకున్నామని పోలీసులు తెలియజేస్తున్న పరిస్థితి ఉంది.
అయితే ప్రభుత్వం మాత్రం ఇప్పటి వరకు స్పందించకపోయినప్పటికీ నేడు స్పందిస్తుందా లేదా అనేది చూడాల్సి ఉంది.