వచ్చే సార్వత్రిక ఎన్నికలలో టీడీపీ( TDP ) మరియు జనసేన పార్టీలు కలిసి పోటీ చెయ్యబోతున్నాయి అనే సంగతి మన అందరికీ తెలిసిందే.చంద్రబాబు ని రాజమండ్రి జైలులో కలిసి బయటకి వచ్చిన తర్వాత ఈ నిర్ణయాన్ని పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) అధికారికంగా మీడియా ముందు తెలిపాడు.
అప్పటి నుండి రాష్ట్ర రాజకీయాల ముఖ చిత్రమే మారిపోయింది.అధికార వైసీపీ పార్టీ టీడీపీ – జనసేన( TDP – Janasena ) ని దెబ్బ కొట్టేందుకు ఎన్ని దారులు ఉన్నాయో, అన్నీ దారుల్లో వారిని అడ్డుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తుంది.
ఇదంతా పక్కన పెడితే పొత్తు ప్రకటించిన తర్వాత ఇప్పటి వరకు ఇరు పార్టీల ఉమ్మడి కార్యాచరణ పై ఎలాంటి సమీక్ష జరపలేదు.రీసెంట్ గానే సమన్వయ కమిటీని ఏర్పాటు చేసి జనసేన పార్టీ తరుపున 5 మందిని, అలాగే టీడీపీ పార్టీ తరుపున 5 మందిని ఏర్పాటు చేసారు .ఈ కమిటీ లో మొదటి చర్చ ఈ నెల 23 వ తారీఖున జరగబోతుంది.

ఈ చర్చలో పవన్ కళ్యాణ్ మరియు నారా లోకేష్( Nara Lokesh ) కూడా పాల్గొనబోతున్నారు.వాస్తవానికి ఈ చర్చ ఎప్పుడో జరగాల్సి ఉంది, కానీ పవన్ కళ్యాణ్ కి వైరల్ ఫీవర్ రావడం వల్ల వాయిదా పడింది.ఇకపోతే నిన్న మంగళగిరిలో పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ ముఖ్య నేతలతో అంతర్గత చర్చలు జరిపాడు.
ఈ చర్చల్లో పవన్ కళ్యాణ్ కి సీట్ షేరింగ్ విషయం లో నాయకులూ పలు ముఖ్యమైన సూచనలు చేసినట్టు తెలుస్తుంది.ఈటిపరిస్థితి లో రాబోయే ఎన్నికలలో జనసేన పార్టీ 50 స్థానాల్లో పోటీ చెయ్యాలని, మీరు 23 న జరగబొయ్యే మీటింగ్ ఇది చర్చకి వస్తే కచ్చితంగా 50 సీట్స్ డిమాండ్ చెయ్యాలని పవన్ కళ్యాణ్ ని బలంగా కోరుకున్నారు జనసేన పార్టీ నేతలు.
అంతే కాదు రెండు సంవత్సరాల పాటు పవర్ షేరింగ్ కూడా ఉండాలి అంటూ పవన్ కళ్యాణ్ కి చెప్పుకున్నారు.

పవర్ షేరింగ్ లేకపోతే జనసేన పార్టీ జనాల్లో ఎప్పటికీ ప్రత్యామ్న్యాయం అవ్వదు అని, పార్టీ కోసం అభిమానులు ఎంతో కష్టపడ్డారని , వారిలో నమ్మకం ఎప్పటికీ రాబోదని పవన్ కళ్యాణ్ ముందు నేతలు చెప్పుకొచ్చారు.కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ పార్టీ తగ్గకుండా ఉండేలా చూడాలని పవన్ కళ్యాణ్ ని రిక్వెస్ట్ చేసారు.ఒకవేళ పవర్ షేరింగ్ లేకపోతే ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అభిమానుల వోట్ ట్రాన్స్ ఫర్ ( Vote Transfer )కూటమి కి జరగదని, అప్పుడు పొత్తు పెట్టుకొని ఎలాంటి ఉపయోగం ఉండదు అంటూ చెప్పుకొచ్చారట.
మరి పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ నాయకుల రిక్వెస్ట్ ని పరిగణలోకి తీసుకొని నారా లోకేష్ తో చర్చలు జరుపుతాడా లేదా అనేది చూడాలి.