బుల్లి తెరపై జగపతి జీవితం

ఫ్యామిలీ హీరోగా స్టార్‌ ఇమేజ్‌ను సొంతం చేసుకున్న జగపతిబాబు ప్రస్తుతం విలన్‌ పాత్రల్లో, క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా బిజీగా ఉన్న విషయం తెల్సిందే.

తాజాగా ఈయన నటించిన ‘శ్రీమంతుడు’ మంచి సక్సెస్‌ను అందుకుంది.

ఇక ప్రస్తుతం ఎన్టీఆర్‌ సినిమాలో విలన్‌ పాత్రలో కనిపించబోతున్నాడు.హీరోగా ఉన్న సమయంలో జగపతిబాబు హద్దు అదుపు లేకుండా ఖర్చు చేసే వాడు.

దాంతో ఇప్పటి వరకు సంపాదించింది ఏం లేదని, అందుకే ఇకపై కుటుంబ సభ్యుల కోసం సంపాదిస్తాను అంటూ చెప్పుకొచ్చాడు.జగపతిబాబు జీవితంలో ఎన్నో ఆసక్తికర సంఘటనలు మరియు సన్నివేశాలు ఉన్నాయి.

వాటన్నింటిని ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి.జగపతిబాబు ఆటోబయోగ్రఫీని బుల్లి తెరపై 13 ఎపిసోడ్‌లుగా చూపించేందుకు సన్నాహాలు పూర్తి అయ్యాయి.

Advertisement

‘సముద్రం’ టైటిల్‌తో జగపతిబాబు నటించిన ఈ ఆటోబయోగ్రఫీ అతి త్వరలో ప్రముఖ ఎంటర్‌టైన్‌మెంట్‌ ఛానెల్‌లో ప్రసారం కానున్నట్లుగా తెలుస్తోంది.ఈ ‘సముద్రం’లో ఎన్నో ఆసక్తికర విషయాలను జగపతిబాబు చెప్పే అవకాశాలున్నాయని, ఇలాంటి ప్రయత్నం ఇండియన్‌ సినీ ఇండస్ట్రీలో మొదటి సారి జగపతిబాబు చేస్తున్నాడు అంటూ టాక్‌ ఆఫ్‌ ది ఇండస్ట్రీగా ఉంది.

ఈ సూపర్ హిట్ సినిమాల్లో మొదట అనుకున్న హీరోయిన్స్ ఎవరో తెలుసా..?
Advertisement

తాజా వార్తలు