నేడు ఉత్తరాంధ్ర టూర్ లో జగన్ ! బిజీ బిజీ

ఏపీలోనూ సార్వత్రిక ఎన్నికల సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో వైసిపి( YCP ) అధినేత ఏపీ సీఎం జగన్( CM jagan ) స్పీడ్ పెంచారు .

ప్రాంతాలు , నియోజకవర్గాల వారీగా పర్యటనలు చేపట్టేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.

అనేక అభివృద్ధి పథకాలను ప్రారంభించే నిమిత్తం జగన్ పర్యటనలు చేపడుతున్నారు .  అలాగే త్వరలోనే విశాఖ నుంచి పరిపాలనను చేపట్టేందుకు సిద్ధమవుతున్న జగన్ అక్కడ క్యాంప్ ఆఫీస్ నిర్మాణంపై దృష్టి పెట్టారు అలాగే ప్రభుత్వ కార్యాలయాల ఏర్పాటుకు అవసరమైన బిల్డింగుల ఎంపిక ప్రక్రియను పూర్తి చేశారు.దీంతోపాటు,  ఉత్తరాంధ్ర ప్రాంతంపై ప్రత్యేకంగా ఫోకస్ పెడుతున్నారు .దీనిలో భాగంగానే ఈరోజు జగన్ ఐటీసీ హిల్ నెంబర్ 2 లో ఇన్ఫోసిస్ కార్యాలయాన్ని ఫార్మసిటిలో కొత్తగా నిర్మించిన యూజీఓ స్టెరిల్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ నిర్మించిన అదనపు భవనాలను జగన్ ప్రారంభించనున్నారు.

జగన్ షెడ్యూల్ ఇలా.ఈరోజు ఉదయం 10 గంటలకు గన్నవరం ఎయిర్ పోర్ట్ నుంచి బయలుదేరి 10 20 గంటలకు విశాఖపట్నం ఎయిర్ పోర్టు కు చేరుకుంటారు.  అక్కడ నుంచి హెలికాఫ్టర్ లో మధురవాడ ఐటి హిల్స్ కు చేరుకుంటారు.అక్కడ నుంచి రోడ్డు మార్గంలో ఇన్ఫోసిస్ డెవలప్మెంట్ సెంటర్ కు వెళ్ళనున్నారు.10: 50 గంటల నుంచి 11: 55 వరకు అక్కడే జగన్ గడుపుతారు .

తరువాత జీవీఎంసీ ఏర్పాటు చేసిన బీచ్ క్లీనింగ్ యంత్రాలను జగన్ఏపీఎస్ఈ జెడ్ కు చేరుకుని, లారస్ ల్యాబ్ యూనిట్ టూ ను ప్రారంభిస్తారు.తర్వాత విశాఖ ఎయిర్ పోర్టు ఏర్పాటుకు చేరుకుని , అక్కడ నుంచి 03: 20 గంటలకు ప్రత్యేక విమానంలో గన్నవరం చేరుకుంటారు.

Advertisement
అంతమాట అన్నావేంటి సామీ? వైసిపి గెలుపై పికే జోస్యం
Advertisement

తాజా వార్తలు