పార్టీని గాలికొదిలేశారా ? పట్టించుకునే తీరిక లేదా ? 

ఏపీలో వైసీపీ ప్రభుత్వ పాలన పై భిన్నాభిప్రాయాలు జనాల్లో ఉన్నాయి.

పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్దఎత్తున సంక్షేమ పథకాలను అమలు చేయడంతో భారీగానే జనాలు లబ్ధిపొందారు.

ఇంకా లబ్ధి పొందుతూనే ఉన్నారు.అయినా జనాల్లో ఏదో తెలియని అసంతృప్తి ప్రభుత్వంపై ఏర్పడింది.

ప్రభుత్వపరంగా అమలు చేస్తున్న సంక్షేమ పథకాల విషయంలోనూ,  మిగతా పథకాల గురించి కానీ జనాల్లో ప్రచారం చేసుకోవడంలో జగన్ సక్సెస్ అవ్వలేక పోయారనే అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తం అవుతన్నాయి.ఏపీ సీఎంగా జగన్ బాధ్యతలు స్వీకరించి దాదాపు మూడేళ్ల అవుతుంది.

ఈ మూడేళ్ల పాటు పూర్తిగా సంక్షేమ పథకాలు, ప్రభుత్వ వ్యవహారాలపై జగన్ ఎక్కువగా దృష్టి పెట్టారు.      పార్టీ వ్యవహారాలను అంతంతమాత్రంగానే ఆయన పట్టించుకున్నట్టు గా కనిపిస్తున్నారు.

Advertisement

అధికారం చేపట్టిన తరువాత పాదయాత్రలో ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు.ఎప్పటికప్పుడు ఏదో ఒక కొత్త పథకాన్ని అమలు చేసేందుకు జగన్ ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు.

కానీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి పార్టీ వ్యవహారాలను ఆయన పట్టించుకోనట్లు గానే కనపిస్తున్నారు.రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు ప్రతి నియోజకవర్గంలోనూ ఆధిపత్య పోరు గ్రూపు రాజకీయాలు నడుస్తున్నాయి.

అయినా జగన్ ఆ వ్యవహారాలపై పూర్తిస్థాయిలో దృష్టి పెట్టలేకపోతున్నారు.   

   2019 ఎన్నికలకు ముందు ఉన్న కమిటీలే ప్రస్తుతం కొనసాగుతున్నాయి.పార్టీని పూర్తిగా ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉన్నా, జగన్ మాత్రం పార్టీ వ్యవహారాలను కొంతమంది కీలక నాయకులకు అప్పగించి పూర్తిగా ప్రభుత్వ పరిపాలన పైన దృష్టి పెట్టారు.జగన్ ఎక్కువగా తాడేపల్లి క్యాంప్ కార్యాలయానికే పరిమితం అయిపోతున్నారు.

ఇదేందయ్యా ఇది.. బాయ్‌ఫ్రెండ్‌పై కోపంతో ఇలా కూడా చేస్తారా..??
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీకి పాలాభిషేకం.. బాబుకు భలే షాకిచ్చారుగా!

దీంతో క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందనేది జగన్ కు పూర్తి స్థాయి లో అర్థం కావడం లేదు.ఇక పార్టీ కేడర్ లో నిరుత్సాహం బాగా పెరిగిపోయింది.

Advertisement

ప్రస్తుత ఏపీలో 26 జిల్లాలను ఏర్పాటు చేస్తూ , ఏపీ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది.ఈ 26 జిల్లాల్లోనూ పార్టీ కార్యవర్గ లను నియమించడం వంటి వ్యవహారాలపై జగన్ దృష్టి సారించకపోతే పార్టీ పరిస్థితి ఎన్నికల నాటికి బాగా దెబ్బ తింటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

" autoplay>

తాజా వార్తలు