వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరం సదస్సులో పాల్గొనేందుకు స్విట్జర్లాండ్‌లోని జురెక్‌ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న జగన్‌..

దావోస్‌: వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరం సదస్సులో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి వైయస్‌.జగన్‌ దావోస్‌ చేరుకుంటున్నారు.

స్విట్జర్లాండ్‌లోని జురెక్‌ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న ఆయన రోడ్డు మార్గంలో దావోస్‌ ప్రయాణమయ్యారు.మరికాసేపట్లో ఆయన దావోస్‌ చేరుకుంటారు.

రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖామంత్రి గుడివాడ అమర్నాథ్, ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి సీఎంకు స్వాగతం పలికారు.ముఖ్యమంత్రి స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ జవహర్‌రెడ్డి, ప్రిన్సిపల్‌ కార్యదర్శి ఆరోఖ్యరాజ్‌ సీఎంకు సాదర స్వాగతం పలికారు.

స్విట్జర్లాండ్‌లో భారత ఎంబసీ రెండో కార్యదర్శి రాజీవ్‌కుమార్, ఎంబసీలో మరొక రెండవ కార్యదర్శి బిజు జోసెఫ్‌ తదితరులు ముఖ్యమంత్రికి స్వాగతం పలికిన వారిలో ఉన్నారు.స్విట్జర్లాండ్‌లో ఉంటున్న తెలుగువారు కూడా సీఎంకు స్వాగతం పలికిన వారిలో ఉన్నారు.

Advertisement
ఎన్టీఆర్ ఫ్యాన్స్ సపోర్ట్ లేకుండా డాకు మహారాజ్ హిట్టవుతుందా.. ఆ రేంజ్ కలెక్షన్లు వస్తాయా?

తాజా వార్తలు