తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు జబర్దస్త్ ఎక్స్ ట్రా జబర్దస్త్ కామెడీ షో గురించి మనందరికీ తెలిసిందే.ఈ జబర్దస్త్ షో( Jabardasth ) ద్వారా ఎంతో మంది కమెడియన్లు ఆర్టిస్టులు సినిమా ఇండస్ట్రీకి పరిచయం అవడంతో పాటు వెండితెరపై అవకాశాలను అందుకుంటూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే.
జబర్దస్త్ ఎంతోమందికి ఈ లైఫ్ ఇచ్చింది అని చెప్పవచ్చు.అంతేకాకుండా జబర్దస్త్ ద్వారా చాలామంది సెలబ్రిటీ హోదాలను దక్కించుకున్నారు.
అటువంటి వారిలో బుల్లెట్ భాస్కర్( Bullet Bhaskar ) కూడా ఒకరు.ప్రస్తుతం కొనసాగుతున్న బుల్లెట్ భాస్కర్ తన కామెడీతో ప్రేక్షకులను కడుపుబ్బానవ్విస్తూ కమెడియన్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపుని ఏర్పరచుకున్నాడు.
మొదట రేడియా జాకీగా చేసిన భాస్కర్ మహేష్ బాబు, ప్రముఖుల వాయిస్‌లను మిమిక్రీ చేస్తుంటారు.రాఘవ, చంటి టీమ్‌లో స్రిప్టు రైటర్, కంటెస్టుగా వచ్చి టీమ్ లీడర్‌గా ఎదిగాడు.అనేక మందికి అతడు కూడా లైఫ్ ఇచ్చాడు.మంచి పేరు తెచ్చుకున్నాడు.
ఇది ఇలా ఉంటే ఈనెల 7వ తేదీన ప్రసారమయ్యే ఎక్స్ట్రా జబర్దస్త్ కి( Extra Jabardasth ) సంబంధించిన ప్రోమో వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.అయితే ఆ ప్రోమో కాస్త ఈ ప్రస్తుతం వివాదాస్పదంగా మారింది.
ఇంతకు ఆ ప్రోమోలో ఏముంది అన్న విషయానికి వస్తే.భాస్కర్ టీంలో నరేష్‌తో( Naresh ) పాటు అతడి తల్లిదండ్రులు కూడా నటించారు.
స్కిట్టులో భాగంగా ఒక నటి బావగారూ సినిమాకు తీసుకెళతారా అని భాస్కర్ తండ్రిని అడగ్గా.సెకండ్ షోకు వెళ్లకమ్మా.ఆయనకు రే చీకటి అంటూ తల్లి కౌంటర్ ఇచ్చింది.ఆయనకు నెల ఇన్ కమ్ ఎంత వస్తుందమ్మా అని అడగ్గానే రూ.2750 వస్తుందమ్మా అని చెబుతుంది భాస్కర్ తల్లి.అదేంటీ మరేమీ పెరగదా మరేమీ పెరగదు.
గవర్నమెంట్ మారితే పెరుగుతుంది అంటూ భాస్కర్ తల్లి డైలాగ్ వేశారు.ఈ డైలాగ్ కాస్త వివాదాస్పదంగా మారింది.
దీంతో బుల్లెట్ భాస్కర్ పై వైసీపీ నేతలు జగన్ అభిమానులు( CM Jagan ) మండిపడుతున్నారు.కాగా ప్రస్తుతం ఏపీలో వృద్ధాప్య ఫించను కింద రూ.2750 ఇస్తున్న విషయం తెలిసిందే.
దీన్ని ఉద్దేశించి ఆ డైలాగులు ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.సాధారణంగా తన స్కిట్లకు తానే డైలాగ్స్ రాస్తుంటారు బుల్లెట్ భాస్కర్. ఇలా స్కిట్లు పేరుతో ప్రభుత్వంపై విమర్శలు చేయడం సరికాదని హెచ్చరిస్తున్నారు.
ఈ ప్రోగ్రామ్ యాజమాన్యంపై కూడా మండిపడుతున్నారు.దీంతో వెంటనే బుల్లెట్ భాస్కర్ వివరణ ఇచ్చారు.
తన తల్లి తరుపున క్షమాపణలు తెలిపారు .కార్యక్రమం నుండి ఆ డైలాగులు తొలగిస్తున్నట్లు చెప్పారు.