దుబ్బాక బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావును పోలీసులు అరెస్ట్ చేశారు.గజ్వేల్ కు వెళ్తుండగా మార్గమధ్యలో అడ్డుకున్న పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు.
గజ్వేల్ లో ఇటీవల రెండు వర్గాల మధ్య వివాదం జరిగిన విషయం తెలిసిందే.ఈ క్రమంలో శివాజీ విగ్రహం వద్ద చోటు చేసుకున్న ఘర్షణలో కొందరు గాయపడ్డారు.
ఈ క్రమంలో గాయపడిన వారిని పరామర్శించడానికి గజ్వేల్ కు ఎమ్మెల్యే రఘునందన్ రావు బయలు దేరారు.శాంతి భద్రతల నేపథ్యంలో రంగంలోకి దిగిన పోలీసులు ఎమ్మెల్యే రఘునందన్ రావును ముందస్తుగా అరెస్ట్ చేసి అల్వాల్ పోలీస్ స్టేషన్ కు తరలించారు.







