జబర్దస్త్ కి రమ్మని వాళ్ళు పిలవరు.. పిలిచినా నేను వెళ్ళను.. అప్పారావు కామెంట్స్ వైరల్!

తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు జబర్దస్త్ షో గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.ఈ జబర్దస్త్ షో ద్వారా ఎంతోమంది కమెడియన్ లు ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు.

అంతేకాకుండా ఎంతోమంది కమెడియన్లు వెండి తెరకు కూడా పరిచయమైన విషయం తెలిసిందే.ఈ జబర్దస్త్ ఎంతో మంది ఆర్టిస్టులకు జీవితాన్ని ఇచ్చింది అని చెప్పవచ్చు.

ఈ జబర్దస్త్ స్టేజ్ ద్వారా ఎంతోమంది పాపులర్ అయ్యారు.అలాంటివారిలో జబర్దస్త్ కమెడియన్ అప్పారావు కూడా ఒకరు.

ఈ మధ్యకాలంలో అప్పారావు జబర్దస్త్ తెలుగులో అంతగా కనిపించడం లేదు.అయితే జబర్దస్త్ షోలో తాను కనిపించకపోవడానికి అసలు కారణాన్ని బయట పెట్టేసాడు అప్పారావు.

Advertisement
Jabardasth Comedian Apparao Talking About Jabardasth Show Details, Jabardasth,

తాజాగా ఇంటర్వ్యూలో పాల్గొన్న అప్పారావు పలు షాకింగ్ విషయాలు బయట పెట్టేసాడు.చెప్పుడు మాటలు విని తనను హోల్డ్ లో పెట్టారని, కరోనా సమయంలో నా వయసు ఎక్కువ కావడంతో కొద్ది రోజులు దూరంగా ఉండమని చెప్పారని ఆ తర్వాత నన్ను పూర్తిగా హోల్డ్ లో పెట్టేశారు అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు అప్పారావు.

అలా తనను హోల్డ్ లో పెట్టడం వల్ల తనకు బాధగా అనిపించి జబర్దస్త్ షోని మానేసాను అని చెప్పుకొచ్చాడు అప్పారావు.అనంతరం కమెడియన్ బుల్లెట్ భాస్కర్ గురించి మాట్లాడుతూ బుల్లెట్ భాస్కర్ ని గొప్పగా పొగిడాడు.

అంతేకాకుండా బుల్లెట్ భాస్కర్ తనని ఎప్పుడూ కూడా హర్ట్ చేయలేదని తెలిపాడు.

Jabardasth Comedian Apparao Talking About Jabardasth Show Details, Jabardasth,

అలాగే బుల్లెట్ భాస్కర్ టీమ్ పైమా వచ్చిన తర్వాత బాగా పాపులర్ అయ్యింది అని తెలిపాడు.అయితే నేను జబర్దస్త్ నుంచి వెళ్లిపోతున్న సమయంలో భాస్కర్ గనుక నాకు అప్పారావు కావాలి ఆయన టీం లో ఉండాలి అని ఉంటే అక్కడ ఎవరూ కాదనే వారు కాదు.భాస్కర్ అవైడ్ చేశాడు.

ఈ రెండు ఉంటే చాలు పైసా ఖర్చు లేకుండా వైట్ అండ్ గ్లాస్ స్కిన్ ను పొందొచ్చు!
పబ్లిసిటీ కంటే అదే ముఖ్యమని చెప్పిన యామీ గౌతమ్.. అలా మాత్రం చేయొద్దంటూ?

మిగిలిన లీడర్లు మాకు వద్దు, మాకు వద్దు అని అన్నారు అని తెలిపాడు అప్పారావు.అయినా ఏం పర్వాలేదు ఇప్పుడు జబర్దస్త్ కి ఎవరు రమ్మని పిలవరు ఒకవేళ పిలిచినా కూడా నేను వెళ్ళను.

Advertisement

ఎందుకంటే ప్రస్తుతం కామెడీ స్టార్స్, ఈవెంట్స్, అలాగే సినిమాల్లో చిన్న చిన్న క్యారెక్టర్లు చేసుకుంటున్నాను అని చెప్పుకొచ్చాడు అప్పారావు.

తాజా వార్తలు