ఫోటో ఫోజ్ కోసమని 200 ఏళ్ల శిల్పాన్ని విరగొట్టిన ఘనుడు...!

మ్యూజియం అంటేనే పురానా వస్తువులను భద్రంగా దాచిపెట్టి ఉండే స్థలం.ఈ మ్యూజియం లో కొన్ని వందల సంవత్సరాల వస్తువులు, శిల్పాలు ఒకచోటికి చేర్చి ఉంటాయి.

ప్రతి వస్తువుకు, ప్రతి శిల్పాన్ని ప్రతి ఒక్కరు ప్రజలు తాకడానికి వీలులేకుండా ఉండేందుకు అద్దాలతో అమర్చబడి ఉంటారు.ఎందుకంటే ఒక మ్యూజియంను చూడడానికి ప్రతిరోజు కొన్ని వేల మంది సందర్శకులు వస్తూ ఉంటారు.

అక్కడ వచ్చిన ప్రజలు వాటిని ముట్టుకొని నాశనం చేయకుండా ఉండడానికి ఆలా చేస్తారు.కానీ ఇటలీ దేశం లోని పోసాగ్నో లోని జిప్సోథెకా ఆంటోనియో కనోవా మ్యూజియంలో పురాతన వస్తువులను ఎలాంటి భద్రత లేకుండా అంటే.

అద్దాలు లేకుండా ప్రజల సందర్శనార్థం ఉంచారు.ఈ మధ్య కొందరు మహానుభావులు మ్యూజియంలో ఉండే శిల్పాల మీద కూర్చుని సెల్ఫీలు తీసుకోవడం అలవాటుగా మారింది.

Advertisement

రకరకాల భంగిమలలో ఫోటోలు దిగుతూ తమ స్నేహితులతో పంపుకోవడం అలవాటుగా చేసుకున్నారు.ఇటీవల ఆస్ట్రేలియాకు చెందిన ఒక టూరిస్టు ఈ మ్యూజియం సందర్శించి 200 సంవత్సరముల క్రిందట ఉన్న శిల్పం మీద కూర్చొని ఫోటోలకు ఫోజులు ఇచ్చాడు.

ఇక్కడి వరకు బాగానే ఉంది.అయితే ఫోటోలు దిగిన తర్వాత అతని ప్రవర్తన లో కొంత మార్పు కనిపించింది.

అదేదో జరిగిపోయినట్టు అక్కడ, ఇక్కడ దిక్కులు చూస్తూ తచ్చాడుతున్నాడు.మిగతా వాళ్ళు శిల్పాలను చూస్తూ ముందుకు వెళ్తున్నారు.

తాను మాత్రము అక్కడే ఏదో పోగొట్టుకున్న వాని మాదిరి వెతుకుతున్నాడు.ఇంతకు విషయము ఏమిటంటే.

అభిమన్యుడి మరణం శ్రీకృష్ణుడికి ముందే తెలుసా..?
వీడియో వైరల్ : శోభనం గదిలో ఆలియా, రణ్ వీర్.. ఇదే తొలిసారి అంటూ..

ఆ వ్యక్తి ఫోటో దిగుతున్నప్పుడు తన చెయ్యి బలముగా తాకడంతో ఆ శిల్పం యొక్క కుడి కాలి బొటనవేలు విరిగిపోవడం జరిగింది.ఇది ఎవరు చూడలేదు కదా అని చుట్టూ చూస్తూ ఉండడం కనిపించింది.

Advertisement

అయితే జనాలు ఎవరు ఇతనిని గమనించలేదు.కానీ, అక్కడ ఉన్న సీసీ కెమెరాలు మాత్రం ఇట్టే పట్టించాయి.

ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.దింతో కొన్ని వందల సంవత్సరాల నాటి శిల్పాల మీద కూర్చుని ఫోటోలు తీసుకోవడం సరియైన పద్ధతి కాదని నెటిజన్లు తీవ్ర అగ్రం వ్యక్తం చేస్తున్నారు.

ఇంకొక విషయం ఏమిటంటే శిల్పాల చుట్టూ కనీస భద్రతా చర్యలు చేపట్టకపోవడం పలువురిని ఆశ్చర్యానికి గురిచేస్తున్నది.ఇటువంటి మహానుభావులను మనము ఏమనాలో కూడా తెలియదు.

తాజా వార్తలు