తాజాగా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ 2021-2022 బడ్జెట్ పార్లమెంటులో ప్రవేశ పెట్టడం జరిగింది.ఈ సందర్భంగా పార్లమెంటులో ప్రసంగించిన ఆమె కరోనా వైరస్ వలన ఆర్థికంగా నష్టపోయినా గాని గాడిలో పెట్టేందుకు ఎన్డీఏ సర్కార్ తీవ్రంగా కృషి చేస్తున్నట్లు స్పష్టం చేశారు.
అంతేకాకుండా లాక్ డౌన్ సమయంలో ప్రభుత్వం చేసిన కార్యక్రమాలను కూడా వివరించడం జరిగింది.
ఇదిలాఉంటే కరోనా కట్టడికి 2007లో అందుబాటులోకి తెచ్చినట్లు మరో రెండు వ్యాక్సిన్లు భారత్తో పాటు ఇతర దేశాలకు ఎగుమతి చేస్తున్నట్లు మొత్తంమీద చూసుకుంటే ప్రపంచ వ్యాప్తంగా 100 దేశాలకు భారత్ కరోనా వ్యాక్సిన్ పంపిణీ చేస్తున్నట్లు స్పష్టం చేశారు.
మహమ్మారి కరోనా ని కట్టడి చేయడంలో అదేవిధంగా ఆర్థిక వ్యవస్థను గడిలో పెట్టడంలో ఎన్డీఏ సర్కారు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు స్పష్టం చేశారు.సరైన సమయంలో దేశంలో లాక్ డౌన్ నిర్ణయం కేంద్ర ప్రభుత్వం తీసుకోవటం జరిగిందని లేకపోతే దేశంలో ఘోరమైన పరిస్థితి ఉండేదని నిర్మలా సీతారామన్ తెలిపారు.