మ‌ధుమేహం రోగులు ఈ పండ్లు తింటే చాలా డేంజ‌ర్‌.. తెలుసా?

మ‌ధుమేహం లేదా షుగ‌ర్ వ్యాధి.నేటి కాలంలో చాలా మందిని వేధిస్తున్న స‌మ‌స్య ఇది.

మ‌ధుమేహం వ్యాధి ఒక్క సారి వ‌చ్చిందంటే జీవిత‌కాలం ఇబ్బంది పెడుతూనే ఉంటుంది.మ‌ధుమేహం వ్యాధి నివార‌ణ‌కు ఎలాంటి చికిత్స లేదు.

కేవ‌లం చ‌క్కెర స్థాయిల‌ను అదుపు చేసే మందులు మాత్ర‌మే అంద‌బాటులో ఉన్నాయి.అందుకే మ‌ధుమేహం వ్యాధి గ్ర‌స్తులు ప్ర‌తి విష‌యంలోనూ చాలా జాగ్ర‌త్త‌గా ఉండాలి.

అయితే మధుమేహం ఉన్నవారు పండ్లు తినకూడదని చాలామంది భావిస్తారు.ఇది నిజ‌మే.

కానీ, అన్ని పండ్ల‌కు దూరంగా ఉండాల్సిన అవ‌స‌రం లేదు.కేవ‌లం కొన్ని కొన్ని పండ్లకు దూరంగా ఉంటే చాలంటున్నారు.

Advertisement

మ‌రి ఆ పండ్లు ఏంటీ అన్న‌ది ఇప్పుడు తెలుసుకుందాం.సీతాఫలం.

ఆరోగ్యానికి ఎంత మంచిదో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు.కానీ, మ‌ధుమేహం రోగులు మాత్రం సీతాఫ‌లం తిన‌క‌పోవ‌డ‌మే మంచిది.

ఎందుకంటే, సీతాఫ‌లంలో చ‌క్కెర మ‌రియు కార్బోహైడ్రేట్లు అత్య‌ధికంగా ఉంటాయి.కాబ‌ట్టి, సీతాఫ‌లం తీసుకుంటే బ్ల‌డ్ షుగ‌ర్ లెవ‌ల్స్ పెరిగిపోతాయి.

అలాగే మ‌ధుమేహం రోగులు దూరంగా ఉండాల్సిన పండ్ల‌లో ద్రాక్ష పండ్లు కూడా ముందు వ‌ర‌స‌లో ఉంటాయి.ద్రాక్షలో కూడా చక్కెర పరిమాణం ఎక్కువ‌గా ఉంటాయి.అర‌టి పండ్లు అందులో బాగా పండిన అర‌టి పండ్ల‌కు మ‌ధుమేహం రోగులు తీసుకోక‌పోవ‌డ‌మే మంచిది.

ఎస్‌యూవీ కారుపైకి దూకిన కోతి.. అది చేసిన తుంటరి పనికి యజమాని షాక్!
పుష్ప 2 అనుకున్న రేంజ్ లో ఆడకపోతే ఎవరికి ఎక్కువ నష్టం వస్తుంది...

అర‌టి పండులో ఉండే చక్కెర స్థాయిలు.బ్ల‌డ్ షుగ‌ర్ లెవ‌ల్స్‌ను పెంచేస్తాయి.

Advertisement

ఎన్నో పోష‌కాలు నిండి ఉండే పుచ్చకాయను అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు.కానీ, మ‌ధుమేహం రోగులు మాత్రం ప‌చ్చ‌కాయ తిన‌క‌పోవ‌డ‌మే మంచిదంటున్నారు ఆరోగ్య నిపుణులు.

‌ ఇక వీటితో పాటుగా.పైనాపిల్, స‌పోటా, ఆప్రికాట్ వంటి పండ్లు కూడా మ‌ధుమేహం రోగుల‌కు ఏ మాత్రం మంచిది కాదు.

అయితే మ‌ధుమేహం రోగులు దానిమ్మ, బొప్పాయి, బెర్రీస్‌, చెర్రీస్‌, నేరేడు, జామకాయ, యాపిల్ వంటివి మితంగా తీసుకుంటే.ఆరోగ్యానికి ఎంతో మేలు జ‌రుగుతుంది.

తాజా వార్తలు