థియేటర్లకు జనాలు రావాలంటే ఒకే ఒక్క మార్గం

కరోనా లాక్‌ డౌన్‌ వల్ల 9 నెలల క్రితం మూత బడ్డ థియేటర్లు డిసెంబర్‌ లో పునః ప్రారంభించేందుకు గాను ఏర్పాట్లు జరుగుతున్నాయి.

సినిమా థియేటర్లు ప్రారంభించినా ప్రేక్షకులు వస్తారా లేదా అనేది ప్రస్తుతం అనుమానంగా ఉంది.

వ్యాక్సిన్‌ మరో రెండు మూడు నెలల్లో వచ్చే అవకాశం ఉంది.అప్పటి వరకు వెయిట్‌ చేద్దాం అని చాలా మంది ప్రేక్షకుల వెయిట్‌ చేసే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది.

అయితే సినిమా బాగుంటే ఎంతటి భయం అయినా మరేదైనా ప్రేక్షకులు మాత్ర ఆగరు.ఒక్కసారి సినిమాకు పాజిటివ్‌ టాక్‌ వస్తే హిట్‌ టాక్‌ వస్తే ఖచ్చితంగా బాక్సాఫీస్‌ ముందు క్యూ కట్టి మరీ టికెట్లు తీసుకుని లోనికి వెళ్తారు.

అయితే విడుదల అయ్యేవి అన్ని కూడా మంచి సినిమాలు అని చెప్పలేం.కాని ఈసమయంలో మంచి సినిమాలు వస్తేనే థియేటర్లకు మనుగడ అనేది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

Advertisement

థియేటర్లకు 50 శాతం ఆక్యుపెన్సీతో అనుమతులు ఇచ్చారు.కనీసం 40 శాతం అయినా నిండితేనే మెయింటెన్స్‌ వచ్చే అవకాశం ఉంటుంది.

అలా కాదని థియేటర్లకు పది లేదా ఇరవై శాతం మంది ప్రేక్షకులు వస్తాము అంటే మాత్రం థియేటర్ల పని అయిపోయినట్లే.ఈ విషయంలో థియటర్ల యాజమాన్యాలు ఆందోళనతో ఉన్నారు.

ప్రస్తుతం మూతపడి ఉన్నాయి కనుక ఎలాంటి ఇబ్బంది లేదు.ఎప్పుడైతే థియేటర్లు ఓపెన్‌ అవుతాయో అప్పుడు మళ్లీ మెయింటెన్స్‌ పెట్టాల్సి ఉంటుంది.

నెలకు లక్షల్లో ఉద్యోగులకు జీతాలు చెల్లిస్తూ ఇతర మెయింటెన్స్‌ ఖర్చులు భరిస్తూ ఉండాలి.ఒక వేళ థియేటర్లకు జన కళ లేకుంటే అవన్ని కూడా యాజమాన్యంపై పడే అవకాశం ఉంది.

పోలింగ్ ఏజెంట్ల నియామకంపై ఈసీ ఆదేశాలు
తల్లికి 15 లక్షల విలువ చేసే జ్యూవెలరీ ఇచ్చిన పల్లవి ప్రశాంత్.. ఈ కొడుకు గ్రేట్ అంటూ?

అందుకే ఇలాంటి సమయంలో జనాలు థియేటర్లకు రావాలంటూ హిట్‌ టాక్‌ తెచ్చుకునే సినిమాలు విడుదల చేయడం ఒక్కటే మార్గం.అంటే ఆర్‌ఆర్‌ఆర్‌ వంటి సినిమాలకు మాత్రమే ఇప్పుడున్న పరిస్థితుల్లో మంచి స్కోప్‌ ఉంటుంది.

Advertisement

కాని ఆ సినిమా రావడానికి ఇంకా చాలా సమయం ఉంది.స్టార్‌ హీరోల సినిమాలు ఏవీ కూడా 50 శాతం ఆక్యుపెన్సీతో వచ్చే ఆసక్తి చూపడం లేదు.

దాంతో జనాలు థియేటర్లకు వచ్చే పరిస్థితి ఏంటీ అనేది ఎవరికి అర్థం అవ్వడం లేదు.సంక్రాంతికి పెద్ద సినిమాలు ఏమైనా వస్తే అప్పుడు జనాలు క్యూ కట్టేనో చూడాలి.

తాజా వార్తలు